ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఎండ్రకాయను చూడగానే ఓ పిల్లికి నోరు ఊరగా.. మరో పిల్లి ఎలా ఫీల్ అయిందో మీరే చూడండి..

ABN, First Publish Date - 2023-01-11T16:02:31+05:30

పెంపుడు జంతువులను.. ఆహారం దగ్గర నుంచి ప్రతి విషయంలో యజమానులు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంటారు. తమ పిల్లల మీద ఎంత ప్రేమ చూపిస్తారో.. అంతే ప్రేమను పెంపుడు జంతువులపై కూడా చూపిస్తుంటారు. ఇందుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెంపుడు జంతువులను.. ఆహారం దగ్గర నుంచి ప్రతి విషయంలో యజమానులు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంటారు. తమ పిల్లల మీద ఎంత ప్రేమ చూపిస్తారో.. అంతే ప్రేమను పెంపుడు జంతువులపై కూడా చూపిస్తుంటారు. ఇందుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు దర్శనమిస్తుంటాయి. ప్రస్తుతం పిల్లులకు సంబంధించిన వీడియో (cats Videos) ఒకటి తెగ వైరల్‌గా మారింది. ఆహార పదార్థాల విషయంలో పిల్లలు కొన్నింటిపై ఆసక్తి కనబరచడం, మరికొన్నింటిపై అనాసక్తి చూపించడం సర్వసాధారణమే. అయితే ఇప్పుడు చూడబోయే వీడియోలో.. ఎండ్రకాయ (lobster) విషయంలో ఓ పిల్లి ఆసక్తి చూపించగా, మరో పిల్లి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Viral Video: ఆటోను చూడగానే అనుమానం వచ్చి ఆపిన పోలీసులు.. తీరా ఆటో లోపల చూస్తే..

సోషల్ మీడియాలో పెంపుడు పిల్లలకు సంబంధించిన ఓ వీడియో (Viral trending videos) ట్రెండింగ్‌గా మారింది. ఓ వ్యక్తి తన పిల్లులను.. సొంత పిల్లల మాదిరే చూసుకుంటుంటాడు. సోపాలో హాయిగా పడుకుని ఉన్న పిల్లుల వద్దకు ఓ ఎండ్రకాయను తీసుకెళ్తాడు. మొదట నిద్రపోతున్న ఓ పిల్లి వద్దకు వెళ్లి, ఎండ్రకాయను దగ్గరగా పెడతాడు. దాని వాసన గుర్తించగానే దాని నోరు ఊరిపోతుంది. వెంటనే పైకి లేచి ఎండ్రకాయను తినేందుకు ఎగబడుతుంది. అయితే దాన్ని పిల్లికి అందించకుండా కాసేపు ఊరిస్తూ ఉంటాడు. అయినా పిల్లి మాత్రం దాన్ని తినేందుకు యజమానిని అనుసరిస్తూ వెళ్తుంది. అలాగే తర్వాత అదే ఎండ్రకాయను మరో పిల్లి వద్దకు తీసుకెళ్తాడు. అయితే ఆ పిల్లి మాత్రం.. ఎండ్రకాయా.. యాక్.. నాకొద్దు ..!.. అన్నట్లుగా వాంతికి చేసుకున్నట్లు నటిస్తుంది. అచ్చం చిన్న పిల్లల తరహాలో.. ఆ పిల్లి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ (Cat expression).. నెటిజన్లను ఆకట్టుకుంటోంది. బహుశా ఈ పిల్లి వెజిటేరియన్ అయి ఉండొచ్చు... అంటూ అంతా కామెంట్లు పెడుతున్నారు.

ప్రియుడితో వివాహిత వీడియో కాలింగ్.. అతను రెచ్చగొట్టడంతో.. మధ్యలో ఉన్నట్టుండి ఆమె చేసిన పని..

Updated Date - 2023-01-11T16:06:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising