Viral Video: ఆటోను చూడగానే అనుమానం వచ్చి ఆపిన పోలీసులు.. తీరా ఆటో లోపల చూస్తే..

ABN , First Publish Date - 2023-01-10T19:47:55+05:30 IST

కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి వారు.. వారు ప్రమాదానికి గురవడమే కాకుండా పక్కనున్న వారినీ ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. కొందరు వాహన డ్రైవర్లు.. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం తరచూ చూస్తుంటాం. ప్రస్తుతం..

Viral Video: ఆటోను చూడగానే అనుమానం వచ్చి ఆపిన పోలీసులు.. తీరా ఆటో లోపల చూస్తే..

కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి వారు.. వారు ప్రమాదానికి గురవడమే కాకుండా పక్కనున్న వారినీ ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. కొందరు వాహన డ్రైవర్లు.. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం తరచూ చూస్తుంటాం. ప్రస్తుతం ఓ ఆటోకు సంబంధించిన వీడియో (Auto videos).. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రయాణికులతో కిక్కిరిసిన ఓ ఆటో.. వేగంగా వెళ్తుండడాన్ని గమనించిన పోలీసులు (police) మధ్యలోనే ఆపేశారు. చివరకు అందులో ఉన్న ప్రయాణికులును చూసి ఖంగుతిన్నారు.

Viral Video: దుకాణంలోకి ఈ జింక ఎంట్రీ మామూలుగా లేదు.. చూస్తే అవాక్కవడం ఖాయం..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral Videos) అవుతోంది. ప్రయాణికులతో కిక్కిరిసిన ఓ ఆటో వేగంగా వెళ్తోంది. దాని వెనుకే కారులో వస్తున్న పోలీసులు.. ఆటోను గమనిస్తూ ఉన్నారు. కొంతదూరం వెళ్లగానే ఆటో డ్రైవర్‌పై అనుమానం వచ్చి మధ్యలోనే నిలిపేస్తారు. ఆటోలో ఉన్న వారందరినీ కిందకు దిగమని చెబుతారు. వారు ఒక్కొక్కరుగా దిగుతుంటే.. మరోవైపు ఓ వ్యక్తి లెక్కపెడుతూ ఉంటాడు. అందులో ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 19మంది ఉండడాన్ని చూసి పోలీసులు ఖంగుతిన్నారు. చివరకు ఆటో డ్రైవర్‌పై కేసులు నమోదు చేసి, అవగాహన కల్పించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆటో డ్రైవర్‌కు బాగా బుద్ధి చెప్పారంటూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రియుడితో వివాహిత వీడియో కాలింగ్.. అతను రెచ్చగొట్టడంతో.. మధ్యలో ఉన్నట్టుండి ఆమె చేసిన పని..

Updated Date - 2023-01-10T19:48:03+05:30 IST