ప్రియుడితో వివాహిత వీడియో కాలింగ్.. అతను రెచ్చగొట్టడంతో.. మధ్యలో ఉన్నట్టుండి ఆమె చేసిన పని..

ABN , First Publish Date - 2023-01-10T18:05:15+05:30 IST

ఓ వివాహిత పెళ్లికి ముందే ఓ యువకుడితో ప్రేమలో ఉండేది. వివాహమైన తర్వాత కూడా అతడితో ప్రేమాయణం సాగించేది. ఈ విషయం భర్తకు తెలియడంతో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల ప్రియుడితో వీడియో కాల్ మాట్లాడుతుండగా..

ప్రియుడితో వివాహిత వీడియో కాలింగ్.. అతను రెచ్చగొట్టడంతో.. మధ్యలో ఉన్నట్టుండి ఆమె చేసిన పని..
ప్రతీకాత్మక చిత్రం

ఓ వివాహిత పెళ్లికి ముందే ఓ యువకుడితో ప్రేమలో ఉండేది. వివాహమైన తర్వాత కూడా అతడితో ప్రేమాయణం సాగించేది. ఈ విషయం భర్తకు తెలియడంతో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల ప్రియుడితో వీడియో కాల్ మాట్లాడుతుండగా షాకింగ్ ఘనట చోటు చేసుకుంది. మాటల మధ్యలో ప్రియుడు రెచ్చగొట్టడంతో ఆమె ఉన్నట్లుండి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...

అర్ధరాత్రి షాకింగ్ ఘటన.. నడి రోడ్డుపై ఏడు మందిని అత్యంత కిరాతకంగా.. వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు

జార్ఖండ్ (Jharkhand) రామ్‌గఢ్ జిల్లా బర్లంగా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పుర్బతాడ్ అనే ప్రాంతానికి చెందిన పాయల్ కుమారి అనే మహిళ.. తన భర్తతో కలిసి ఉంటోంది. ఈమె తన పెళ్లికి ముందే.. బర్కాగావ్ ప్రాంతానికి చెందిన మంజిత్ కుమార్ అనే వ్యక్తితో ప్రేమాయణం (love) సాగించింది. వివాహం అనంతరం కూడా అతడితో మాట్లాడుతూ, తరచూ కలుస్తూ ఉండేది. కొన్నాళ్లకు ఈ విషయం తన భర్తకు తెలిసింది. దీంతో దంపతుల (couple) మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల ఈ గొడవలు (quarrels) మరింత ముదిరిపోయాయి.

Viral Video: చీర కట్టుకుని.. రోటీన్‌కు భిన్నంగా మహిళ చేసిన కసరత్తులు.. మామూలుగా లేవు..

అయినా ఆమె మాత్రం ప్రియుడితో మాట్లాడుతూనే ఉండేది. అయితే ఈ క్రమంలో మంజిత్.. తన ప్రేయసిని దూరం పెట్టేందుకు ప్రయత్నించేవాడు. పాయల్ కుమారి మాత్రం మంజిత్‌ను మర్చిపోలేకపోయింది. నవంబర్ 26న తన గ్రామంలో జరిగే వివాహ వేడుకల్లో ఇద్దరం కలుద్దామంటూ ప్రియుడికి చెప్పింది. అయితే మంజిత్ మాత్రం ఆమెకు చెప్పకుండా 18న పూణే వెళ్లిపోయాడు. దీంతో నవంబర్ 19న ప్రియుడికి వీడియో కాల్ (video call) చేసింది. అతన్ని మర్చిపోవడం తన వల్ల కాదని, త్వరగా రావాలని పట్టుబట్టింది.

అత్తతో చనువుగా ఉంటూ వచ్చిన యువకుడు.. మామ విషయంలో రహస్యంగా ఆమె చెప్పింది విని.. చివరకు..

ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. తనను చూడటానికి రాకుంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. ఇందుకు ప్రియుడు చచ్చిపో.. అంటూ రెచ్చగొట్టడంతో ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. లైవ్‌లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య (suicide) చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ప్రియుడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి ఆత్మహత్యకు సంబంధించిన వీడియోలను తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హనీమూన్‌లో అర్ధరాత్రి నిద్ర లేచిన భర్త.. భార్య ఏం చేస్తోందో చూద్దామని వెతగ్గా.. ఎదురుగా..

Updated Date - 2023-01-10T18:05:15+05:30 IST