Viral Video: చీర కట్టుకుని.. రోటీన్‌కు భిన్నంగా మహిళ చేసిన కసరత్తులు.. మామూలుగా లేవు..

ABN , First Publish Date - 2023-01-08T21:06:05+05:30 IST

అంతా చేసే పనులైనా అందరిలా చేస్తే ఏముంటుందీ.. ఏదైనా కొత్తగా చేసి చూపించాలని.. ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. అలాంటి పనులు ఒక్కోసారి అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తుంటాయి. ఇక మహిళలు చేసే పనులు అందరినీ కట్టిపడేస్తుంటాయి. ఇలాంటి..

Viral Video: చీర కట్టుకుని.. రోటీన్‌కు భిన్నంగా మహిళ చేసిన కసరత్తులు.. మామూలుగా లేవు..

అంతా చేసే పనులైనా అందరిలా చేస్తే ఏముంటుందీ.. ఏదైనా కొత్తగా చేసి చూపించాలని.. ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. అలాంటి పనులు ఒక్కోసారి అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తుంటాయి. ఇక మహిళలు చేసే పనులు అందరినీ కట్టిపడేస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని.. వినూత్నంగా చేసిన కరసత్తులు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

అత్తతో చనువుగా ఉంటూ వచ్చిన యువకుడు.. మామ విషయంలో రహస్యంగా ఆమె చెప్పింది విని.. చివరకు..

viral-trending-videos.jpg

నెట్టింట ఓ వీడియో తెగ వైరల్‌గా (women Viral videos) మారింది. కొందరు యువతులు చీర కట్టుకుని నడిచేందుకే ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది ఓ మహిళ సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని.. ఏకంగా కరసత్తులు (Exercises) చేస్తోంది. అందులోనూ సాధారణానికి భిన్నంగా ఆమె చేసిన కసరత్తులు చూసి అంతా అభినందనలతో ముంచెత్తుతున్నారు. వివిధ రకాల చీరలు ధరిస్తూ ఓ మహిళ.. జిమ్ సెంటర్‌లో తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించింది. మగవారికి ఏమాత్రం తగ్గకుండా కసరత్తులు చేయడమే కాకుండా.. ఓ పెద్ద టైర్‌ను ఎత్తుకుని ఆమె చేసిన స్టంట్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మరో కరణం మళ్లీశ్వరి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

హనీమూన్‌లో అర్ధరాత్రి నిద్ర లేచిన భర్త.. భార్య ఏం చేస్తోందో చూద్దామని వెతగ్గా.. ఎదురుగా..

Updated Date - 2023-01-08T21:07:48+05:30 IST