ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: అర్ధరాత్రి వేణువులను విక్రయిస్తున్న.. ఈ వ్యక్తి జేబులోని డబ్బులు చూసి.. షాక్ అవుతున్న నెటిజన్లు..

ABN, First Publish Date - 2023-05-23T18:07:23+05:30

కూటి కోసం కోటి విద్యలు అన్నట్లు.. మనిషి ఏ పని చేసినా, ఎన్ని విద్యలు ప్రదర్శించినా.. అవన్నీ పొట్ట కూటి కోసమే. కొందరు కాలు కదపకుండా ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదిస్తుంటే.. మరికొందరు ఉదయం నుంచి రాత్రి వరకూ కష్టపడ్డా.. చివరకు ఆదాయం మాత్రం అంతంతమాత్రమే ఉంటుంది. జీవనోపాధికోసం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూటి కోసం కోటి విద్యలు అన్నట్లు.. మనిషి ఏ పని చేసినా, ఎన్ని విద్యలు ప్రదర్శించినా.. అవన్నీ పొట్ట కూటి కోసమే. కొందరు కాలు కదపకుండా ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదిస్తుంటే.. మరికొందరు ఉదయం నుంచి రాత్రి వరకూ కష్టపడ్డా.. చివరకు ఆదాయం మాత్రం అంతంతమాత్రమే ఉంటుంది. జీవనోపాధికోసం చాలా మంది కష్టాలను భరిస్తూ గొడ్డు చాకిరీ చేస్తుంటారు. అయినా కొన్నిసార్లు తినేందుకూ ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తరచూ చూస్తూ ఉంటాం. ప్రస్తుతం ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. అర్ధరాత్రి వేణువులు విక్రయిస్తున్న వ్యక్తి జేబులోని డబ్బులు చూసి నెటిజన్లు.. అయ్యో పాపం! అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రాత్రి వేళ రోడ్డుపై వేణువులను విక్రయిస్తూ ఉన్నాడు. చూడగానే ఏదో ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపంచడంతో ఓ వ్యక్తి వీడియో (Video) తీసుకుంటూ అతడి వద్దకు వెళ్లాడు. ఉదయం నుంచి రాత్రి వరకూ వేణువులను (Sale of Flutes) విక్రయించడం కోసం అతడు పడిన కష్టం తెలుసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. అంత కష్టపడ్డా చివరకు అతడి జేబులో కేవలం రూ.60లు మాత్రమే ఉంది. ఉదయం నుంచి భోజనం కూడా చేయకుండా వేణువులు విక్రయిస్తున్నట్లు సదరు వ్యక్తి ఏడుస్తూ చెప్పాడు.

Curly Hair కోసమంటూ బ్యూటీ సెలూన్‌కు వెళ్లిన ఈ మహిళకు ఇలా జరిగిందేంటి..? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజాలు విని..!

ఆ సమయంలో హోటళ్లు కూడా మూసి ఉండడంతో వీడియో తీసిన వ్యక్తి.. అతడి ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చాడు. అంతేగాకుండా ఆ చిరు వ్యాపారిని ఆర్థికంగా ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నాడు. వేణువుల విక్రేత ఇబ్బందుల గురించి తెలుసుకున్న ఎంతో మంది తమ సాయంగా ఆర్థిక సాయం (Financial assistance) అందజేస్తున్నారు. కాగా, వ్యాపారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘అయ్యో పాపం! ఇతడికి ఎంత కష్టం వచ్చిపడింది’’.. అని కొందరు, ‘‘ఇలాంటి పరిస్థితి శత్రువులకు కూడా రాకూడదు’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాలి’’.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో లైకులను సొంతం చేసుకుంది.

IVF: ఐవీఎఫ్‌ ట్రీట్మెంట్‌కు వెళ్లిన ఓ 33 ఏళ్ల మహిళకు షాకింగ్ అనుభవం.. ఆస్పత్రి నుంచి భర్తకు ఫోన్.. అవతలి వాళ్లు చెప్పింది విని..

Updated Date - 2023-05-23T18:07:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising