ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పెళ్లి వేదికపై దీపికా పదుకొణె బికినీ స్టెప్పులు వేసిన అతిథులు.. మక్కీకి మక్కీ దించేశారంటున్న నెటిజన్లు..

ABN, First Publish Date - 2023-01-31T19:46:35+05:30

వివాహ కార్యక్రమాల్లో వివిధ విన్యాసాలు, వినూత్న పద్ధతులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. దీంతో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ వివాహాల్లో ఏదో ఒక విచిత్రమైన పని చేసి, అందరి దృష్టిలో పడుతున్నారు. కొందరైతే ఒకడుగు ముందుకేసి మరీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివాహ కార్యక్రమాల్లో (Wedding events) వివిధ విన్యాసాలు, వినూత్న పద్ధతులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. దీంతో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ వివాహాల్లో ఏదో ఒక విచిత్రమైన పని చేసి, అందరి దృష్టిలో పడుతున్నారు. కొందరైతే ఒకడుగు ముందుకేసి మరీ.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి వేదికపై వరుడి స్నేహితులంతా దీపికా పదుకొణె బికినీ స్టెప్పులను (Deepika Padukone bikini steps) వేసి అందరినీ అలరించారు. ఈ వీడియో చూసిన నెటిజన్ల మక్కీకి మక్కీ దించేశారంటూ కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. వివాహ కార్యక్రమంలో డీజే పాటలకు (DJ songs) డాన్స్ చేయడం సర్వసాధారంగా జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో వరుడి స్నేహితులు కాస్త విభిన్నంగా ఆలోచించారు. అందరిలా డ్యాన్స్ చేస్తే వెరైటీ ఏముంటుందీ అనుకున్నారో ఏమోగానీ.. ఏకంగా దీపికా పదుకొణె ‘బేషరమ్ రంగ్' పాటలోని (Deepika Padukone Besharam Rang song) బికినీ స్టెప్పులను వేశారు. అచ్చం దీపికా పదుకొణె చేసినట్లుగానే చేయడంతో పక్కన ఉన్న మిగతా అతిథులంతా చప్పట్లతో మారుమోగించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ స్టెప్పులు చూడముచ్చటగా ఉన్నాయంటూ కొందరు, మా వివాహాల్లో ఇలాంటి నృత్యాలు మిస్ అయ్యాం.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: రైలు కదులుతుండగానే డోర్ తెరచి దిగేసిన వ్యక్తి.. చివరికి ఏమైందో చూడండి..

Updated Date - 2023-01-31T19:46:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising