ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: సెలూన్ షాపులో ఇలాంటి సీన్ ఎప్పుడైనా కనిపించిందా..? ఓ కుర్రాడు ఏం చేశాడో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-04-05T20:59:56+05:30

ప్రస్తుతం యువత తమ అందానికి మెరుగులు దిద్దుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్లామర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. కొందరైతే నిత్యం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రస్తుతం యువత తమ అందానికి మెరుగులు దిద్దుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్లామర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. కొందరైతే నిత్యం బ్యూటీపార్లర్లు, సెలూన్‌లలోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్ని సార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. సెలూన్ షాపులో కటింట్ చేయించుకునే క్రమంలో ఓ యువకుడు ఏం చేశాడంటే..

సోషల్ మీడియాలో ఓ యువకుడికి సంబంధించిన వీడియో తెగ వైరల్‌గా (Viral videos) మారింది. ఓ వ్యక్తి కటింగ్ చేయించుకునేందకు సెలూన్‍‌కు (salon viral video) వెళ్తాడు. కుర్చీలో కూర్చోగానే బార్బర్ కటింగ్ చేయడం స్టార్ట్ (barber cutting hair) చేస్తాడు. ఇందులో విశేషం ఏమీ లేకున్నా.. కటింగ్ చేసే క్రమలో మధ్యలో యువకుడు చేసిన పని చూసి బార్బర్‌తో పాటూ అంతా తెగ నవ్వుకుంటున్నారు. కటింగ్ చేసే క్రమంలో మధ్యలో బార్బర్.. ట్రిమ్మర్‌తో యువకుడి మెడ వద్ద షేవ్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో చెవి పైన వెంట్రులను తొలగించాల్సి రావడంతో తలను కదపకుండా జాగ్రత్తగా ఉండాలని సదరు యువకుడికి సూచిస్తాడు.

Viral Videos: ఓరి నాయనో.. మెట్రో రైళ్లలో ఇన్ని కళాఖండాలా..? డ్రస్సుల నుంచి ముద్దు సీన్ల వరకు ఎన్ని నిర్వాకాలు జరిగాయో మీరే చూడండి..!

అయితే ఇందుకు సదరు యువకుడు.. ఎంతో సింపుల్‌గా ఓ పని చేస్తాడు. ‘‘నా చెవి వల్ల నాకు గానీ, మీకు గానీ ఎలాంటి ఇబ్బందీ రాదు’’.. అంటూ చేత్తో చెవిని (Ear folding) మెలిపెట్టేస్తాడు. దీంతో ఆశ్చర్యకరంగా చెవి మొత్తం మడతపడి అలాగే ఉండిపోతుంది. అతడు చేసిన పని చూసి బార్బర్ నవ్వు ఆపుకోలేకపోతాడు. ‘‘వామ్మో!.. ఇదేం మ్యాజిక్’’.. అంటూ గట్టిగా నవ్వుకుంటాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అరె! చెవిని ఇలాక్కూడా మడత పెట్టొచ్చా... అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో లైకులను సొంతం చేసుకుంది.

VGold Facts: ఈ ప్రపంచంలో అసలు ఎన్ని టన్నుల బంగారముంది..? మొత్తం బంగారాన్ని ఒక్క చోట చేర్చి కరిగించి తీగలా మార్చితే..

Updated Date - 2023-04-05T20:59:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising