ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వామ్మో.. ఇదేం కాంబినేషన్.. థంబ్సప్‌తో పానీపూరీనా..? తిన్నవాళ్ల రియాక్షన్ ఏంటంటే..

ABN, First Publish Date - 2023-02-21T18:33:09+05:30

పానీపూరీని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. పానీపూరీ తయారీలో కొందరు అపరిశుభ్రత పాటిస్తూ ఉంటారు. ఇంకొందరు కలపకూడని పిచ్చి పిచ్చి పదార్థాలన్నీ వేసేసి, ఇష్టమొచ్చినట్లు తయారు చేస్తుంటారు. అయినా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పానీపూరీని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. పానీపూరీ తయారీలో కొందరు అపరిశుభ్రత పాటిస్తూ ఉంటారు. ఇంకొందరు కలపకూడని పిచ్చి పిచ్చి పదార్థాలన్నీ వేసేసి, ఇష్టమొచ్చినట్లు తయారు చేస్తుంటారు. అయినా పానీపూరీని యువతీయువకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే కొందరు వ్యాపారులు మాత్రం.. తమ నైపుణ్యంతో వినూత్నంగా ప్రయత్నించి.. కస్టమర్లను ఆకట్టుకుంటుంటారు. కొన్ని సార్లు కొన్ని కొన్ని రెసిపీలను (food recipes) ఫుడ్ లవర్స్ తెగ ఇష్టపడుతుంటారు. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పానీపూరీలో థంబ్సప్‌ (thumbs up) మిక్స్ చేశాడు. ఇది తిన్న వాళ్ల రియాక్షన్ ఏంటంటే...

సోషల్ మీడియాలో పానీపూరీకి సంబంధించిన ఓ వీడియో (Panipuri viral videos) తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ పానీపూరీ వ్యాపారి.. తన కస్టమర్లకు వెరైటీ రుచిని అందించే ప్రయత్నం చేశాడు. ఇందుకోసం అతను ఓ గిన్నెలో పానీ తీసుకుని, అందులో ఉప్పు తదితర మసాలా దినుసులు కలపడంతో పాటూ చివరకు థంబ్సప్‌ కూడా పోస్తాడు. చివరగా అన్నింటినీ మిక్స్ చేసి, పూరీతో కలిపి ఓ మహిళకు అందిస్తాడు. ఎలా ఉంటుందో ఏమో అని అనుమానంగానే తిన్న ఆమె.. కాసేపు ఆగి ‘‘వావ్! ఇది చాలా అద్భుతంగా ఉంది’’.. అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇదేదో వెరైటీగా ఉందే.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, ‘‘ఇది తిన్న తర్వాత ఇక నిద్ర కూడా రాదు’’.. ‘‘మాకు వోడ్కా పారీ పూరీ కావాలి’’ అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: పెళ్లివేడుకలో మైమరచిపోయి డాన్స్ చేస్తున్న భార్యాభర్తలు.. వరుడి స్థానంలో ఉన్న వారి కొడుకు రియాక్షన్ చూస్తే..

Updated Date - 2023-02-21T18:33:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising