ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఈ కుక్క నటనకు ఆస్కార్ ఇచ్చినా తక్కువే.. యజమానిని ఎలా మోసం చేసిందో చూడండి..

ABN, First Publish Date - 2023-03-19T21:22:42+05:30

కుక్కలు మనుషుల పట్ల ఎంత విశ్వాసంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే చాలా మంది తమ పెంపుడు కుక్కలను సొంత పిల్లల మాదిరే పెంచుకుంటుంటారు. అలాగే కొన్ని కుక్కలు తమ యజమానుల మీద ఈగ వాలకుండా చూసుకుంటుంటాయి. నిత్యం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కుక్కలు మనుషుల పట్ల ఎంత విశ్వాసంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే చాలా మంది తమ పెంపుడు కుక్కలను సొంత పిల్లల మాదిరే పెంచుకుంటుంటారు. అలాగే కొన్ని కుక్కలు తమ యజమానుల మీద ఈగ వాలకుండా చూసుకుంటుంటాయి. నిత్యం వారినే అంటిపెట్టుకుని ఉంటాయి. పొరపాటున తమ యజమానులు దూరంగా వెళ్తే.. వచ్చే వరకూ పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోని కుక్కలను కూడా చూశాం. ఇలాంటి తెలివైన కుక్కలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. కుక్క అతి తెలివిని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. యజమానిని కుక్క ఎలా మోసం చేసిందో చూస్తే.. మీరు కూడా షాక్ అవుతారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఓ వ్యక్తి ఓ చిప్ ముక్కను (chip piece) తీసుకుని, తన పెంపుడు కుక్క (pet dog) ముందు ఉంచుతాడు. ‘‘నేను వచ్చే వరకూ దీన్ని తినకు’’.. అని హెచ్చరించి వేరే గదిలోకి వెళ్తాడు. యజమాని అలా వెళ్లగానే.. కుక్క యాక్షన్‌లోకి దిగుతుంది. ఎదురుగా ఉన్న చిప్ ముక్కను లటుక్కున లాగిస్తుంది. అయితే తన యజమాని వస్తే.. తిడతాడనే భయంతో ఎలాగైనా కవర్ చేయాలని అనుకుంటుంది. వెంటనే పక్కనే టేబుల్ సొరుగులో ఉన్న చిప్ ముక్కను తీసుకుని, మళ్లీ యథాస్థానంలో పెడుతుంది.

Viral Video: ఇంట్లో హ్యాపీగా డాన్స్ చేస్తున్న భార్యాభర్తలు.. ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్‌లోంచి జూమ్ చేసి మరీ వీడియోను తీసి..

యజమానికి ఎక్కడా డౌట్ రాకుండా ఉండేందుకు.. ఓపెన్‌గా ఉన్న టేబుల్ సొరుగును మూసేస్తుంది. చివరగా టేబుల్‌పై దీనంగా తల పెట్టి, యజమాని కోసం వేచి చూస్తున్నట్లుగా నటిస్తుంది. చివరగా అక్కడికి వచ్చిన యజమాని.. వెరీ గుడ్.. ఇలా చెప్పినట్లు వినాలి.. అంటూ చిప్ ముక్కను కుక్కకు తినిపిస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ కుక్క యాక్టింగ్ అద్భుతం.. అంటూ కొందరు, ఇలాంటి కుక్కను ఎక్కడా చూల్లేదు బాబోయ్.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మరీ ఇంత ఆత్మవిశ్వాసం పనికిరాదు బ్రదర్.. ఇతడు చేసిన విన్యాసం.. చివరకు ఏమైందో చూడండి..

Updated Date - 2023-03-19T21:22:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising