Flying Car: త్వరలో మార్కెట్లోకి ఎగిరే కార్లు..ధర ఎంతంటే..
ABN, First Publish Date - 2023-06-30T17:52:03+05:30
టెక్నాలజీ రోజురోజుకు వేగంగా పెరుగుతోంది. కొత్త కొత్త వాహనాలు..డీజిల్, పెట్రోల్‌తో నడిచే కార్లు.. తాజాగా ఎలక్ట్రిక్ కార్లు కూడా అందుబాటులో వచ్చేశాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ కూడా లభిస్తోంది. అయితే ఇప్పటివరకు ఎగిరే కార్లను చూడలేదు కదా.. ఎగిరే కార్లూ వచ్చేస్తున్నాయి. అమెరికాకు చెందిన ఓ కార్ల తయారీ కంపెనీ ఇప్పుడు ఎగిరే కార్లను కూడా అందుబాటులో తెస్తోంది. దీనికోసం యూఎస్ ప్రభుత్వం నుంచి ఆమోదం కూడా లభించింది.
టెక్నాలజీ వినియోగం రోజురోజుకు వేగంగా పెరుగుతోంది. కొత్త కొత్త వాహనాలు..డీజిల్, పెట్రోల్‌తో నడిచే కార్లు.. తాజాగా ఎలక్ట్రిక్ కార్లు కూడా అందుబాటులో వచ్చేశాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ కూడా లభిస్తోంది. అయితే ఇప్పటివరకు ఎగిరే కార్లను చూడలేదు కదా.. ఎగిరే కార్లూ వచ్చేస్తున్నాయి. అమెరికాకు చెందిన ఓ కార్ల తయారీ కంపెనీ ఇప్పుడు ఎగిరే కార్లను కూడా అందుబాటులోకి తెస్తోంది. దీనికోసం యూఎస్ ప్రభుత్వం నుంచి ఆమోదం కూడా లభించింది.
కాలిఫోర్నియాలోని శాన్ మాటియో కేంద్రంగా అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ రూపొందించిన ఎగిరే కారుకు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రపంచంలో తొలిసారి గాల్లో ఎగిరే కారు ఇదే. ఈ కార్లను 2025 నాటికి వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని కంపెనీ యాజమాన్యం తెలిపింది.
ఇద్దరు వ్యక్తులు ఇందులో ప్రయాణించొచ్చు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 110 మైళ్లు అనగా 177 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. అదేవిధంగా 200 మైళ్లు అనగా 322 కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణించొచ్చు. మోడల్ A ఫ్లయింగ్ కారు ధర 3 లక్షల డాలర్లు.. అంటే మన కరెన్సీలో రూ.2.46 కోట్లు. అయితే ఈ కార్ల కొనుగోలుకు ఇప్పటికే చాలామంది అడ్వాన్స్‌డ్ బుకింగ్ కూడా చేసుకున్నారని కంపెనీ సీఈవో జీమ్ దుఖోవ్నీ తెలిపారు.
అయితే ఇలాంటి ఎగిరే వాహనానికి యూఎస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ ఎగిరే కారు తయారీ కోసం అలెఫ్ కంపెనీ యూఎస్ ఫెడరేషన్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ప్రత్యేకంగా ఎయిర్ వర్త్‌నెస్ సర్టిఫికెట్ పొందడం చాలా సంతోషంగా ఉందని కంపెనీ సీఈవో జిమ్ దుఖోవ్నీ తెలిపారు. ప్రజలకు పర్యావరణపరమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు మేం ముందుకు వచ్చామని జిమ్ తెలిపారు.
అయితే అలెఫ్ మోడల్ A కాకుండా.. అలెఫ్ మోడల్ Z ను కూడా అందుబాటులో తెచ్చేందుకు అలెఫ్ ఏరోనాటిక్స్ కృషి చేస్తోంది. ఈ మోడల్‌ను 2035నాటికి పరిచయం చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. మోడల్ Z మొత్తం ఆరుగురు ప్రయాణించే సౌకర్యం ఉంటుందని జిమ్ తెలిపారు. దీని డ్రైవింగ్ పరిధి 300 మైళ్లు అనగా 483 కిలోమీటర్లు, రోడ్‌పై 220 మైళ్లు అనగా 354 కిలోమీటర్లు. అయితే మోడల్ Z ఎగిరే కారు ఖరీదు 35000 డాలర్ల అనగా మన కరెన్సీలో రూ. 28.72 లక్షలు.
Updated Date - 2023-06-30T18:15:39+05:30 IST