ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Fact check: సోషల్ మీడియాను కుదిపేసిన సందేశం.. నెలకు రూ.6వేల నిరుద్యోగ భృతి.. ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తేలిందంటే..

ABN, First Publish Date - 2023-02-21T11:49:18+05:30

సోషల్ మీడియా (Social Media) వల్ల సందేశాలు ఒకరి నుంచి మరోకరికి చాలా ఈజీ వెళ్లిపోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా (Social Media) వల్ల సందేశాలు ఒకరి నుంచి మరోకరికి చాలా ఈజీ వెళ్లిపోతున్నాయి. ఒక విషయం గురించి సందేశం వచ్చినప్పుడు అందులో ఉన్నది ఎంతవరకు నిజం అనేది కూడా తెలుసుకోకుండా ఒకరి నుంచి మరోకరు చాలా సులువుగా పంచుకోవడం జరుగుతుంది. దాంతో అలాంటి సందేశాలు క్షణాల వ్యవధిలోనే అవి వైరల్‌ (Viral) అవుతుంటాయి. ఇదే కోవలో నిరుద్యోగ భృతికి (Unemployment Benefit) సంబంధించిన సందేశం ఒకటి ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. నిరుద్యోగులకు నెలకు రూ.6వేల నిరుద్యోగ భృతి అనేది ఆ వాట్సాప్ సందేశం (WhatsApp Message). మన దగ్గర ఈ మెసేజ్ అంతగా కనిపించనప్పటికీ ఉత్తరాదిలో మాత్రం సోషల్ మీడియాను కుదిపేసిందనే చెప్పాలి. "ప్రధాన మంత్రి బెరోజ్‌గారి భత్తా యోజన పథకంలో భాగంగా నిరుద్యోగికి నెలకు రూ. 6వేల నిరుద్యోగ భృతి" అనేది ఆ మెసేజ్ సారాంశం.

దీంతో ఈ సందేశం నిమిషాల వ్యవధిలోనే వైరల్ అయింది. దీనిపై నెట్టింట చాలా మంది సెర్చ్ కూడా చేశారు. అయితే, చివరకు ఇది ఒక ఫేక్ సందేశం అని తేలింది. ఎవరో కావాలనే దీన్ని సృష్టించి వైరల్ చేసినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (Press Information Bureau) నిర్ధారించింది. పీఐబీ చేపట్టిన ఫ్యాక్ట్ చెక్‌లో (Fact check) అసలు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఏ స్కీమ్ ప్రవేశ పెట్టలేదని తేల్చింది. నిజనిజాలు తెలుసుకోకుండా ఇలాంటి తప్పుడు సందేశాలను ప్రజలు ఇతరులతో పంచుకోవద్దని ఈ సందర్భంగా పీఐబీ కోరింది. ఇక వైరల్ అయిన ఈ సందేశం ఫేక్ అని తేలడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'మా ఆశలపై నీళ్లు చల్లారు' అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఓరి బుడ్డోడా.. నీకు ధైర్యం కూసింత ఎక్కువేరోయ్.. నెటిజన్లను స్టన్ చేస్తున్న వీడియో..!

Updated Date - 2023-02-21T11:49:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising