ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking story: రెండేళ్ల క్రితం అదృశ్యమైన భార్య.. ప్రియుడితో.. 6 నెలల బిడ్డతో సహా భర్త ఇంటి ముందు ప్రత్యక్ష్యం.. సడన్‌గా చూసి షాకై.. చివరకు..!

ABN, First Publish Date - 2023-06-17T11:30:55+05:30

ఉత్తర ప్రదేశ్‌లోని కన్నౌజ్‌ (Kannauj) లో జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర ప్రదేశ్‌లోని కన్నౌజ్‌ (Kannauj) లో జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి తన భార్యతో సహా ముగ్గురిని చంపేశాడు. అతడు చంపినవారిలో ఆరు నెలల చిన్నారి కూడా ఉండడం అందరినీ కలిచివేసింది. అయితే, అతడు ఈ ఘాతుకానికి పాల్పడడం వెనుక పెద్ద కథే ఉన్నట్లు తెలిసింది. స్థానికుల సమాచారంతో సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కన్నౌజ్ జిల్లా ఉదంపూర్‌కు చెందిన మనోజ్ జాతవ్, పింకీ భార్యాభర్తలు. అయితే, పింకీ రెండేళ్ల క్రితం మణిపూరికి చెందిన తన లవర్ సతేంద్రతో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. దాంతో మనోజ్ ఆమె కోసం చాలా చోట్ల వెతికాడు. కానీ, ఎక్కడ పింకీ జాడ దొరకలేదు. చేసేదేమిలేక ఊరుకున్నాడు.

అయితే, యాదృచ్ఛికంగా బుధవారం రాత్రి పింకీ.. తుండేపుర్వ (Tundepurwa) అనే గ్రామంలో జరిగిన జాతరకు తన లవర్‌తో కలిసి వచ్చింది. వారితో పాటు 6నెలల చిన్నారిని కూడా తీసుకువచ్చారు. అలా జాతరకు వచ్చిన వారు.. బాగా ఆలస్యం కావడంతో తిరిగి వెళ్లేందుకు వారికి కుదరలేదు. దాంతో ఏం చేయాలో తెలియక పింకీ తన లవర్ (Lover) సతేంద్రను తీసుకుని నేరుగా మాజీ భర్త మనోజ్ ఇంటికి వెళ్లింది. అంతే.. రెండేళ్ల క్రితం అదృశ్యమైన భార్యను పక్కన ప్రియుడి, 6 నెలల బిడ్డతో సహా తన ఇంటి ముందు ప్రత్యక్ష్యం కావడం చూసి మనోజ్ షాకయ్యాడు. ఆ తర్వాత వారి ముగ్గురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో కోపోద్రిక్తుడైన మనోజ్ ఓ బలమైన కర్ర తీసుకుని మొదట పింకీపై దాడి చేశాడు. అది చూసిన సతేంద్ర ఆపేందుకు ప్రయత్నించాడు. అప్పటికే భార్యపై కోపంతో రగిలిపోతున్న మనోజ్ ఆ ఇద్దరిని తీవ్రంగా కొట్టాడు.

The Marble Palace: దుబాయిలో అమ్మకానికి రూ.1,600కోట్ల భవంతి.. కొనుగోలు చేసే యోచనలో భారతీయుడు!


దాంతో వారిద్దరూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వారితో పాటు తెచ్చిన ఆరు నెలల చిన్నారికి కూడా ఆ తోపులాటలో దెబ్బలు తగలడంతో చనిపోయింది. ఇక మనోజ్ ఇంటివైపు నుంచి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడి వచ్చి చూస్తే పింకీ, సతేంద్ర, చిన్నారి రక్తపుమడుగులో పడి ఉన్నారు. వారి పక్కనే మనోజ్ రక్తంతో తడిసిన కర్రతో కనిపించాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో మనోజ్ ఇంటికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా పింకీ బాగోతం బయటకు వచ్చింది. ఈ ట్రిపుల్ మర్డర్ ఘటన స్థానికంగా కలకలంగా మారింది.

SBI: ఎస్బీఐలో అకౌంట్ ఉన్నవాళ్లకు కూడా ఈ విషయం తెలిసి ఉండదు.. ఇంట్లో కూర్చునే డబ్బు సంపాదించే స్కీమ్..!

Updated Date - 2023-06-17T11:30:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising