Viral Video: వావ్.. రెస్సాన్సిబుల్ అంటే.. ఈ ఎలుగుబంటిదే.. సింప్లీ సూపర్బ్ అంతే..!
ABN, First Publish Date - 2023-06-07T13:49:02+05:30
మనుషులేనా రెస్సాన్సిబుల్‌గా ఉండేది. నేను కూడా రెస్సాన్సిబులే అంటోందీ ఎలుగుబంటి.
Viral Video: మనుషులేనా రెస్సాన్సిబుల్‌గా ఉండేది. నేను కూడా రెస్సాన్సిబులే అంటోందీ ఎలుగుబంటి. ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోన్న ఈ రెస్సాన్సిబుల్ ఎలుగుబంటి (Responsible Bear) తాలూకు వీడియో మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. ఓ ఎలుగుబంటి తాపీగా ఓ రహదారి వెంబడి నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో దానికి ఆ రహదారి మూలమలుపులో ఓ ట్రాఫిక్ కోన్ (Traffic Cone) కిందపడిపోయి ఉండడం కనిపించింది. వెంటనే ఎలుగుబంటి ఆ కోన్‌ను తన నోటి పళ్లతో పైకి లేపి, నిటారుగా నిలబెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో (Social Media) వైరల్ అవుతోంది. ఇప్పటివరకు వీడియోకు 50వేల వ్యూస్, 2500 లైక్స్ వచ్చాయి. 'వావ్.. సింప్లీ సూపర్బ్', 'ఓ క్రూర జంతువు ఇలా రెస్సాన్సిబుల్‌గా ఉండడం చూస్తుంటే ముచ్చటేస్తుంది' అంటూ కామెంట్ పెడుతున్నారు.
Auto Driver: పొరపాటున ఆటో డ్రైవర్ అయ్యాడు కానీ.. కాస్త చదువుకుని ఉంటే ఎక్కడో ఉండేవాడు.. ఈ ఆటోను ఎలా మార్చేశాడో చూస్తే..!
Updated Date - 2023-06-07T13:54:40+05:30 IST