Auto Driver: పొరపాటున ఆటో డ్రైవర్ అయ్యాడు కానీ.. కాస్త చదువుకుని ఉంటే ఎక్కడో ఉండేవాడు.. ఈ ఆటోను ఎలా మార్చేశాడో చూస్తే..!

ABN , First Publish Date - 2023-06-07T13:04:34+05:30 IST

ప్రస్తుతం నెట్టింట ఓ ఆటో రిక్షా (Auto Rickshaw) తాలూకు వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది (Video goes Viral).

Auto Driver: పొరపాటున ఆటో డ్రైవర్ అయ్యాడు కానీ.. కాస్త చదువుకుని ఉంటే ఎక్కడో ఉండేవాడు.. ఈ ఆటోను ఎలా మార్చేశాడో చూస్తే..!

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం నెట్టింట ఓ ఆటో రిక్షా (Auto Rickshaw) తాలూకు వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది (Video goes Viral). వీడియో చూస్తే.. లగ్జరీ కారుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉందా ఆటో. బెంగళూరుకు (Bengaluru) చెందిన ఓ ఆటోవాలా ఇలా తన ఆటోను అచ్చం లగ్జరీ కారులానే మార్చేశాడు. ఇక వీడియో చూసిన వారు ఈయన పొరపాటున ఆటో డ్రైవర్ అయ్యాడు కానీ.. కాస్త చదువుకుని ఉంటే ఎక్కడో ఉండేవాడు అని అంటున్నారు. ఇక ఆటో విషయానికి వస్తే.. ఆటో బయట, లోపల ఎలా చూసిన కూడా చాలా రీచ్ లుక్‌లో కనిపిస్తుంది. లగ్జరీ కార్లలో ఉండే ఖరీదైన సీట్లు, మంచి పిల్లోస్, డిజిటల్ మ్యూజిక్, ఫ్యాన్లు, కలర్‌ఫుల్‌గా కనిపించేందుకు ఎల్‌ఈడీ లైట్స్ ఉన్నాయి. ఇలా లోపల అంతా కూడా ఓ లగ్జరీ కారు ఫీచర్లతో చూడగానే ఆకట్టుకునేలా ఉంది.

ఇక బయటవైపు కూడా మాములు ఆటోలా కాకుండా కొంచెం డెకరేషన్ ఎక్కువ చేయడంతో ఆటోమెటిక్‌గా రీచ్ లుక్ వచ్చేసింది. ఆటో వెనుకవైపు అయితే ఏకంగా డిజిటల్ డిస్‌ప్లే బోర్డు (Digital Display Board) కూడా ఏర్పాటు చేయించాడు. అలాగే తన అభిమాన నటుడు పునీత్ రాజ్‌కుమార్ పోస్టర్ కూడా ఈ ఆటోపై వేయించాడు. ఇక ఈ ఆటో తాలూకు వీడియోను అజిత్ సహాని అనే ట్విటర్ యూజర్ (@ajithkumar1995a) పోస్ట్ చేశాడు. 'హాలో బెంగళూరు. ఎంతో అందమైన, అద్భుతమైన ఆటో. ఎవరైనా ఇందులో ప్రయాణించారా..?' అనే లైన్స్ కూడా జత చేశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.

Viral Video: 'ఇలాంటి వారికి పెళ్లెందుకు'.. వరుడిని తిట్టిపోస్తున్న నెటిజన్లు..!

Updated Date - 2023-06-07T13:04:34+05:30 IST