ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Women's Day: సమాజం చాలా మారాలి.. ఇంకా భయపడుతున్నారు..

ABN, First Publish Date - 2023-03-05T12:31:20+05:30

అమ్మగా, ఆలిగా, చెల్లిగా, బిడ్డగా.. పలు బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు తమ సాధికారత కోసం మహిళలు ఆయా రంగాల్లో ముందడుగు వేస్తూనే ఉన్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమ్మగా, ఆలిగా, చెల్లిగా, బిడ్డగా.. పలు బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు తమ సాధికారత కోసం మహిళలు ఆయా రంగాల్లో ముందడుగు వేస్తూనే ఉన్నారు. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8)’ సందర్భంగా కొందరు సినీతారలు తమ మనోభావాలను ఇలా పంచుకున్నారు.

మరింత శక్తిమంతంగా..: శృతిహాసన్‌ (Shruti Haasan)

గతంలో కాకుండా నేటితరం.. స్త్రీ పురుష లింగ బేధం లేకుండా ముందుకెళ్లడం సంతోషంగా ఉంది. అయితే ఇప్పటికీ స్త్రీలు తమ అభిప్రాయాలను, బలహీనతలను ధైర్యంగా వెల్లడించేందుకు కాస్త భయపడుతున్నారు. కొన్ని ఇబ్బందికర విషయాలను సూటిగా చెప్పలేనప్పుడు సరదాగా నవ్వుతూనే బయటపెట్టాలి. మరోవైపు దేశవ్యాప్తంగా మహిళలపై చోటుచేసుకుంటున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే.. సమాజం ఇంకా మేల్కోవాల్సి ఉందనిపిస్తోంది. మహిళలు మరింత శక్తిమంతంగా, ధైర్యంగా ముందుకు సాగాల్సిందే.

వారికి ధన్యవాదాలు..: అనుష్క శెట్టి (Anushka Shetty)

ప్రతీ ఒక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. జెండర్‌ ఇక్వాలిటీ అనేది గుర్తుంచుకోవాలి. ప్రొఫెషనల్‌, ఫిజికల్‌, మెంటల్‌, సోల్‌ఫుల్లీ అందరూ బెస్ట్‌గా ఉండేందుకు ప్రయత్నించాలి. గతం గురించి ఆలోచించకుండా ఉన్న కొద్దిపాటి జీవితాన్ని ఎంజాయ్‌ చేయాలి. ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోవాలి. మహిళా దినోత్సవం అనగానే మహిళల గురించే మాట్లాడుకోవడమే కాకుండా... తండ్రిగా, సోదరుడిగా, కొడుకుగా, స్నేహితుడిగా, భర్తగా.. ఇలా ఎన్నో రకాలుగా మహిళలపై ప్రేమను పంచుతూ, ప్రత్యేకంగా చూసుకుంటున్న మగవాళ్లందరికీ ధన్యవాదాలు చెబుదాం.

స్వేచ్ఛను వదులుకోవద్దు!: కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal)

నో డౌట్‌... మహిళలు శక్తిమంతులు. వారు ఎంచుకునే వృత్తిలో ముందుకు వెళ్లేందుకు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. మనకు కావాల్సిన జీవితాన్ని ఏర్పరచుకునే స్వేచ్ఛ మనకు ఉంది. నీకు నచ్చిన దుస్తులను నువ్వు ధరించు... నీకు నచ్చిన భాష నువ్వు మాట్లాడు. ఒకరికి భయపడి నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మార్చుకోకు. ప్రతీ ఒక్కరూ స్త్రీలను గౌరవించాల్సిందే. ధైర్యంగా ముందుకు సాగినప్పుడే జీవితంలో మనల్ని మనం ఆపదల నుంచి రక్షించుకోగలం.

అవకాశం దక్కిన ప్రతీసారి..: పూజా హెగ్డే (Pooja Hegde)

ప్రపంచంలో మహిళ పాత్ర చాలా కీలకమైనది. తల్లిగా, చెల్లిగా, భార్యగా... ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తోంది. ఇంత గొప్ప పాత్రలు పోషిస్తున్న మహిళలను గౌరవిస్తే అంతకు మించిన ధైర్యం, స్థయిర్యం ‘ఆమె’కు ఏముంటుంది. అవకాశం దక్కిన ప్రతీసారి మహిళలు ఏ రంగంలోనైనా విజయాన్ని ముద్దాడుతూనే ఉన్నారు. ఆకాశమే హద్దుగా సాగిపోతున్నారు.

ఒక్క రోజేనా?..: రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh)

ఒక్కరోజే ప్రత్యేకంగా ‘మహిళా దినోత్సవం’ జరుపుకోవడం అనేది నాకెందుకో నచ్చదు. నా ఉద్దేశంలో ప్రతీరోజూ మహిళలకు ప్రత్యేకమైన రోజే. ఎప్పుడూ మహిళలు ఆనందంగా, హుందాగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఇల్లయినా, దేశమైనా, సమాజమైనా ఆరోగ్యకరంగా ఉంటుంది. బంధాలు, బాంధవ్యాలు బలంగా తయారవుతాయి. తద్వారా సంస్కృతీ సంప్రదాయలు కొనసాగుతాయి.

ఇవి కూడా చదవండి:

Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-05T12:42:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising