Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2023-03-02T09:16:08+05:30 IST

ఓ వైపు రాజకీయాలు.. మరో వైపు సినిమాలు అంటూ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దూసుకెళుతున్నారు.

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

ఓ వైపు రాజకీయాలు.. మరో వైపు సినిమాలు అంటూ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దూసుకెళుతున్నారు. రాజకీయంగా చాలా బిజీగా ఉన్నప్పటికీ వరుసగా సినిమాలను కమిట్ అవుతూ.. వాటిని సరైన సమయానికి పూర్తి చేస్తూ రెండు పడవలపై విజయవంతంగా కొనసాగుతున్నారు. అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్నందువల్ల సినిమాలకి సంబంధించిన వేడుకలకి హాజరు కాలేకపోతున్నారు. ఈ కారణంగా ప్రముఖ కన్నడ స్టార్స్ ఉపేంద్ర (Upendra), కిచ్చ సుదీప్‌ (Kichcha Sudeep)కి పవర్ స్టార్ క్షమాపణలు చెప్పారు.

‘‘ఆడియో ఫంక్షన్‌కి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ‘కబ్జా’ టీమ్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే, రాజకీయపరంగా ముందుగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాల వల్ల ఈ ఈవెంట్‌కి హాజరుకాలేకపోతున్నాను. దీనికి నేను చాలా బాధపడుతున్నాను. ఇక హీరోలు ఉపేంద్ర, సుదీప్‌కు నా ప్రత్యేక శుభాకాంక్షలు. వారు వెరైటీ పాత్రలు పోషిస్తూ వివిధ భాషల్లో గుర్తింపు సాధించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్ చంద్రు ఈ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్‌ని సాధించాలి. నిర్మాత శ్రీరామ చంద్ర గౌడ, సంగీత దర్శకులు రవి బస్రూర్, ఇతర మూవీ టీంకి నా శుభాకాంక్షలు’’ అని ఓ ప్రకటనని విడుదల చేశారు పవన్ కల్యాణ్.

కాగా.. ఈ మూవీలో శ్రియా శరణ్ (Shriya Saran), పోసాని కృష్ణ మురళీ, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్చి 17న కన్నడంతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది.

ఇవి కూడా చదవండి:

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-02T10:10:26+05:30 IST