ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: బీరు తాగుతూ బుల్లెట్‌పై ఎంజాయ్ చేసిన యువకుడు.. చివరకు పోలీసులు ఎలాంటి షాక్ ఇచ్చారంటే..

ABN, First Publish Date - 2023-01-21T19:00:41+05:30

బైకులపై విచిత్ర విన్యాసాలు చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇటీవల సర్వసాధారణమైంది. ఈ క్రమంలో కొందరు యువకులు ప్రమాదాలకు గురవడం కూడా జరుగుతుంటుంది. కొందరు యువకులైతే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బైకులపై విచిత్ర విన్యాసాలు చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇటీవల సర్వసాధారణమైంది. ఈ క్రమంలో కొందరు యువకులు ప్రమాదాలకు గురవడం కూడా జరుగుతుంటుంది. కొందరు యువకులైతే అందరి దృష్టిలో పడాలనే ఉద్దేశంతో వినూత్న విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. బీరు తాగుతూ బుల్లెట్‌పై ఎంజాయ్ చేసిన యువకుడికి పోలీసులు ఎలాంటి షాక్ ఇచ్చారంటే..

Viral Video: హోటళ్లలో రోటీలను లొట్టలేసుకుని మరీ తింటున్నారా.. అయితే ఈ వీడియో ఒక్కసారి చూడండి..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఘజియాబాద్ పరిధి ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ముస్సోరి ప్రాంతంలో ఓ యువకుడు బుల్లెట్‌పై (Bullet bike) బీరు తాగుతూ నడిపి హల్‌చల్ చేశాడు. ఓ వ్యక్తి బుల్లెట్ బైకుపై వెళ్తూ ఓ చేత్తో హ్యాండిల్ పట్టుకుని, మరో చేత్తో బీరు (beer) పట్టుకున్నాడు. మధ్యలో మధ్యలో బీరు తాగుతూ వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపాడు. ఈ ఘటనను ముందు వాహనంలో వెళ్తున్న వ్యక్తి.. వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో వైరల్ అవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నో ఎంట్రీ ప్రదేశంలో వాహనం నడపడంతో పాటూ హెల్మెట్ పెట్టుకోకపోవడం, మద్యం సేవించడంపై కేసులు నమోదు చేశారు. అతడికి మొత్తం రూ.31,000 చలాన్ (Challan) వేశారు. బుల్లెట్ బైకు ఘజియాబాద్‌లోని అసలత్‌పూర్ జాతవ్ బస్తీ నివాసి అభిషేక్ పేరు మీద రిజిస్టర్ అయినట్లు పోలీసులు తెలిపారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

ప్రియుడితో కలిసి గదిలో ఉండగా ఇంట్లోకి వచ్చిన కొడుకు.. మీ నాన్నకు చెప్పొందంటూ.. చివరకు తల్లి చేసిన పని..

Updated Date - 2023-01-21T19:00:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising