Funny Video: వామ్మో.. ఇదెక్కడి హెల్మెట్.. వైరల్ అవుతున్న వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేం..
ABN, Publish Date - Dec 18 , 2023 | 01:19 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉండి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఓ ఫన్నీ వీడియో నెట్టింట బాగా హల్‌చల్ చేస్తోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉండి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఓ ఫన్నీ వీడియో (Funny Video) నెట్టింట బాగా హల్‌చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో (Viral Video)లో ఓ బైకర్ హెల్మెట్‌కు బదులుగా ఓ ప్లాస్టిక్ పైప్‌ను తన తలకు తగిలించుకున్నాడు. ఆ వీడియో చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది (Variety Helmet).
@RVCJ_FB అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో బిజీగా ఉన్న రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వెళ్తున్నారు. బైక్ నడుపుతున్న వ్యక్తి ఓ ప్లాస్టిక్ పైప్‌ను (Plastic Pipe) హెల్మెట్‌లా తన తలకు తగిలించుకున్నాడు. ఆ రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి ఆ బైకర్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియోను ఎక్కడ, ఎప్పుడు చిత్రీకరించారనేది బయటకు రాలేదు.
Success Story: 1992 స్కామ్ వల్ల సర్వం కోల్పోయారు.. వీధుల్లో బ్యాగ్‌లు అమ్మి రూ.250 కోట్ల కంపెనీని నిర్మించారు..
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 7.4 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 5 వేల మంది లైక్ చేశారు. ఈ ఫన్నీ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``వీళ్లు నిజంగా అద్భుతమైన వ్యక్తులు``, ``క్రియేటివిటీ పై స్థాయిలో ఉంది``, ``దీనికి కచ్చితంగా పేటెంట్ తీసుకోవాలి``, ``ఈ హెల్మెట్ వల్ల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
Updated Date - Dec 18 , 2023 | 01:19 PM