Share News

Success Story: 1992 స్కామ్ వల్ల సర్వం కోల్పోయారు.. వీధుల్లో బ్యాగ్‌లు అమ్మి రూ.250 కోట్ల కంపెనీని నిర్మించారు..

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:11 PM

ఝార్ఖండ్‌కు చెందిన ఆ తండ్రీకొడుకులు ఇద్దరూ వ్యాపారవేత్తలు.. స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి 1992 హర్షద్ మెహతా స్కామ్‌లో చిక్కుకున్నారు.. ఆ దెబ్బకు సర్వసం కోల్పోయి రోడ్ల మీదకు వచ్చేశారు.. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ధైర్యాన్ని కూడగట్టుకుని ముంబై వీధుల్లో బ్యాగ్‌లు అమ్మడం ప్రారంభించారు..

Success Story: 1992 స్కామ్ వల్ల సర్వం కోల్పోయారు.. వీధుల్లో బ్యాగ్‌లు అమ్మి రూ.250 కోట్ల కంపెనీని నిర్మించారు..

ఝార్ఖండ్‌కు (Jharkhand) చెందిన ఆ తండ్రీకొడుకులు ఇద్దరూ వ్యాపారవేత్తలు.. స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి 1992 హర్షద్ మెహతా స్కామ్‌లో (1992 Scam) చిక్కుకున్నారు.. ఆ దెబ్బకు సర్వసం కోల్పోయి రోడ్ల మీదకు వచ్చేశారు.. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ధైర్యాన్ని కూడగట్టుకుని ముంబై (Mumbai) వీధుల్లో బ్యాగ్‌లు (Bags) అమ్మడం ప్రారంభించారు.. అచంచలమైన సంకల్పం మరియు పట్టుదలతో పని చేసి ఓ కంపెనీ స్థాపించారు. ప్రస్తుతం ఆ తండ్రీ కొడకులు రూ.250 కోట్ల కంపెనీ ``ట్రావరల్డ్``కు అధిపతులు (Success Story).

జార్ఖండ్‌కు చెందిన వ్యాపారవేత్త తుషార్ జైన్ (Tushar Jain), అతని తండ్రి మూల్‌చంద్ జైన్ 1992 హర్షద్ మెహతా కుంభకోణంలో భారీగా డబ్బు పోగొట్టుకున్నారు. దాంతో వారి ఆర్థిక పరిస్థితి తల్లకిందులైంది. కుటుంబాన్ని పోషించేందుకు ముంబై వీధుల్లో సంచులు అమ్మడం ప్రారంభించారు. ఎంతో కష్టపడి పని చేసి, డబ్బులు దాచుకుని 1999లో ``హై స్పిరిట్ కమర్షియల్ వెంచర్స్`` అనే సంస్థను ప్రారంభించారు. రకరకాల బ్యాగ్‌లను తయారు చేసి అమ్మడం ప్రారంభించారు. 2007 నాటికి ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకుని ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు వేల బ్యాగుల మధ్య ఉత్పత్తి చేయడం ద్వారా ఇండియన్ మార్కెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు (Traworld bags).

Viral Video: దీని ముందు పిజ్జా ఎందుకూ పనికి రాదు.. ఆసక్తిర వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా!

2017లో ట్రావరల్డ్, హ్యాష్‌ట్యాగ్‌ బ్రాండ్లను పరిచయం చేసి వాటికి సోనమ్ కపూర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నారు. వీరి కంపెనీ భారతదేశంలో నాలుగో అతిపెద్ద విక్రయదారుగా అవతరించింది. ప్రస్తుతం ట్రావరల్డ్‌కు దేశవ్యాప్తంగా పది ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. కంపెనీ రూ.250 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. రాబోయే పదేళ్లలో తమ కంపెనీని రూ.1000 కోట్ల కంపెనీగా మారుస్తామని తుషార్ నమ్మకంగా చెబుతున్నాడు.

Updated Date - Dec 18 , 2023 | 12:11 PM