Viral Video: దీని ముందు పిజ్జా ఎందుకూ పనికి రాదు.. ఆసక్తిర వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా!
ABN , Publish Date - Dec 18 , 2023 | 09:55 AM
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన ఆసక్తికర, అద్భుత వీడియోలను ట్విటర్‌లో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆయన ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి భారీ పరోటాను తయారు చేశాడు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన ఆసక్తికర, అద్భుత వీడియోలను ట్విటర్‌లో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆయన ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి భారీ పరోటాను (Paratha) తయారు చేశాడు. ఆ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఆ పరోటా ముందు పిజ్జా (Pizza) ఎందుకూ పనికిరాదని కామెంట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి హోటల్ కిచెన్‌లో ఓ భారీ పరోటాను సిద్ధం చేస్తున్నాడు. ఒకడే పరోటా ముద్దను కలిపి అందులో కూర వేసి భారీ పెనంపై కాల్చాడు. అనంతరం దానిని ఓ పెద్ద పళ్లెంలో వేసి కట్ చేసి సర్వ్ చేశారు. ఆ భారీ పరోటాను సులభంగా 8 మంది వరకు తినెయ్యొచ్చు. పరోటా తయారీకి సంబంధించిన ఆ వీడియో ఆనంద్ మహీంద్రాను బాగా ఆకట్టుకుంది. ఆయన ఆ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఆ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 8.2 లక్షల మందికి పైగా వీక్షించారు. 18 వేల మందికి పైగా లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అద్భుతం``, ``పిజ్జాతో పోల్చుకుంటే ఇది చాలా ఆరోగ్యకరం``, ``అద్భుతమైన ట్యాలెంట్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.