ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఎలా వస్తాయయ్యా ఇలాంటి ఐడియాలు.. సైకిల్ సాయంతో డీజిల్ ఇంజిన్‌ను ఎలా స్టార్ట్ చేశారో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-10-31T15:06:41+05:30

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని వీడియోలు అందరినీ ఆకట్టుకుని హల్‌చల్ చేస్తుంటాయి. ముఖ్యంగా ప్రజలు తమ తెలివిని ఉపయోగించి చేసే కొన్ని పనులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని వీడియోలు అందరినీ ఆకట్టుకుని హల్‌చల్ చేస్తుంటాయి. ముఖ్యంగా ప్రజలు తమ తెలివిని ఉపయోగించి చేసే కొన్ని పనులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో (Jugaad Videos) ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Video) అవుతోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. సాధారణంగా పొలాలలో ఉపయోగించే డీజిల్ ఇంజన్లను (Diesel Engine) హ్యాండిల్ ఉపయోగించి స్టార్ట్ చేస్తారు.

హ్యాండిల్ లేకపోతే డీజిల్ ఇంజిన్‌ను స్టార్ట్ చేయడం కష్టమవుతుంది. అలాంటప్పుడు కొందరు అద్భుతమైన ట్రిక్ ఉపయోగించి దానిని స్టార్ట్ చేస్తారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కొందరు వ్యక్తులు సైకిల్ (Bicycle), ఓ తాడు ఉపయోగించి ఇంజిన్‌ను స్టార్ట్ చేశారు. ఇంజిన్ చక్రానికి తాడు కట్టి, దానిని సైకిల్‌కు కట్టాడు. సైకిల్ ముందుకు వెళ్లినపుడు తాడుకు కట్టి ఉన్న చక్రం తిరిగి ఇంజిన్ స్టార్ట్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Shocking: ఈ వ్యక్తి లుంగీ కట్టుకుని దేని మీద కూర్చున్నాడో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. ఇకపై ఆ పదార్థం తినాలంటే..

ఈ వీడియోను ఇప్పటివరకు 2 కోట్ల మందికి పైగా వీక్షించారు. 15 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``ఐడియా బాగానే ఉంది కానీ.. దీని వెనుక ప్రమాదం కూడా పొంచి ఉంది``, ``ఇంజిన్‌ను స్టార్ట్ చేయడానికి ఆ వ్యక్తి తన జీవితాన్ని ప్రమాదంలో పెట్టాడు``, ``మంచి ఐడియా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను పాకిస్థాన్‌ (Pakistan)లో చిత్రీకరించినట్టు తెలుస్తోంది.

Updated Date - 2023-10-31T15:07:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising