Shocking: ఈ వ్యక్తి లుంగీ కట్టుకుని దేని మీద కూర్చున్నాడో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. ఇకపై ఆ పదార్థం తినాలంటే..
ABN , First Publish Date - 2023-10-30T21:10:26+05:30 IST
ఏవైనా పండుగలు వచ్చినా, ఫంక్షన్లు జరుపుకోవాలన్నా చాలా మందికి ముందుగా గుర్తుకొచ్చే వంటకం పన్నీర్ కర్రీ. బిర్యానీలతోనూ, చపాతీలతోనూ, నాన్‌లతోనూ పన్నీర్ కర్రీ తినడాన్ని చాలా మంది ఇష్టపడతారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫొటో చూస్తే పన్నీర్‌పై ప్రేమ కొంచెం తగ్గుతుందేమో.
ఏవైనా పండుగలు వచ్చినా, ఫంక్షన్లు జరుపుకోవాలన్నా చాలా మందికి ముందుగా గుర్తుకొచ్చే వంటకం పన్నీర్ (Paneer)కర్రీ. బిర్యానీలతోనూ, చపాతీలతోనూ, నాన్‌లతోనూ పన్నీర్ కర్రీ (Paneer Curry) తినడాన్ని చాలా మంది ఇష్టపడతారు. పన్నీర్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫొటో (Viral Photo) చూస్తే పన్నీర్‌పై మీకు ఉన్న ప్రేమ కొంచెం తగ్గుతుందేమో. ఆ ఫొటో చూసి చాలా మంది షాక్ అవుతున్నారు (Making of paneer).
Azhar Jafri అనే ట్విటర్ యూజర్ ఈ ఫొటోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ ఫొటోలోని ఓ వ్యక్తి నీలిరంగు లుంగీ ధరించి జున్ను ముక్కలపై పీట వేసుకుని కూర్చున్నాడు. జున్నును తెల్లటి వస్త్రంలో వేసి నీటిని మొత్తాన్ని పిండేందుకు ఆ వ్యక్తి అలా కూర్చున్నాడు. చుట్టూ పరిసరాలన్నీ అపరిశుభ్రంగా ఉన్నాయి. ఈ ఫొటో షేర్ చేసిన వ్యక్తి ``దయచేసి నాన్-బ్రాండెడ్ పన్నీర్‌ను కొనకండి`` అని కామెంట్ చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Food and Health).
Shocking: ఒకే ఇంట్లో ఏడుగురు ఆత్మహత్య.. తెల్లారేసరికి ఇంట్లో అందరూ మరణించారని తెలిసి ఊరంతా షాక్.. అసలేం జరిగిందంటే..!
ఈ ఫొటోను ఇప్పటివరకు 60 వేల మందికి పైగా వీక్షించారు. ఈ ఫొటో చూసిన చాలా మంది పన్నీర్ తయారీ ప్రక్రియ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ``ఓ మైగాడ్.. పన్నీర్‌ను ఇలా తయారు చేస్తారా``, ``బ్రాండెడ్ పన్నీర్ మాత్రం పరిశుభ్రంగా ఉంటుందని ఎలా చెప్పగలం``, ``బ్రాండెడ్ పన్నీర్ తయారు చేసేటపుడు సూటు ధరించిన వ్యక్తి కూర్చుంటాడేమో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.