ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cheetah: రైలు ఇంజిన్‌పై చిరుత.. పడుకుందేమో అని అనుకున్నారు.. భయంభయంగానే వెళ్లి చూస్తే..

ABN, First Publish Date - 2023-03-08T14:27:06+05:30

అది గూడ్స్ రైలు. రైల్వే సైడింగ్ దగ్గరకు వచ్చి ఆగింది. రైలు ఇంజిన్‌పై ఓ చిరుత ప్రత్యక్షమైంది. దగ్గరకెళ్లేందుకు భయం. పడుకుందా? లేదంటే ఏమైనా అయిందా?

భయంభయంగానే వెళ్లి చూస్తే..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అది గూడ్స్ రైలు. రైల్వే సైడింగ్ దగ్గరకు వచ్చి ఆగింది. రైలు ఇంజిన్‌పై ఓ చిరుత ప్రత్యక్షమైంది. దగ్గరకెళ్లేందుకు భయం. పడుకుందా? లేదంటే ఏమైనా అయిందా? ఏం జరిగిందో ఏమో తెలియదు. అందరికీ ఒకలాంటి వణుకు. దగ్గరకెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. చేసేదేమీలేక ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వాళ్లు కూడా భయం భయంగా వెళ్లి చూస్తే ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు.

మహారాష్ట్ర (Maharashtra) చంద్రపూర్‌ జిల్లాలో వనీ బొగ్గు గని క్షేత్రంలోని గుగ్గూస్‌ రైల్వే సైడింగ్‌ దగ్గర గూడ్స్ రైలు (Goods train) వచ్చి ఆగింది. అయితే రైలు ఇంజిన్‌పై చిరుత (Cheetah) దర్శనమిచ్చింది. కానీ ఎవరూ దగ్గరకు వెళ్లేందుకు ధైర్యం చేయలేదు. దీంతో అటవీశాఖ అధికారులకు (Forest officials) రైల్వే అధికారులు సమాచారం అందజేశారు. ఫారెస్ట్ అధికారులు దగ్గరకు వెళ్లి చూస్తే.. రైలు ఇంజిన్‌పై చిరుత అచేతనంగా పడి ఉండటాన్ని గుర్తించారు. తట్టిలేపినా కదలకపోవడంతో చనిపోయినట్లు నిర్ధారించారు. హైటెన్షన్‌ విద్యుత్తు తీగలకు తగిలి ప్రాణం కోల్పోయి ఉంటుందని అధికారులు భావించారు. అనంతరం చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం చంద్రపూర్‌కు తరలించారు.

ఇది కూడా చదవండి: Free Beer Offer: రెండు బీర్లు ఫ్రీ అంటూ ఊరంతా పోస్టర్లు.. ఒకే ఒక్క కండీషన్ పెట్టినా క్యూ కట్టిన జనం..!

చంద్రాపూర్ మెగా థర్మల్ పవర్ స్టేషన్ తడోబా అడవిని ఆనుకొని ఉంటుంది. పైగా అక్కడ పులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు, అనేక ఇతర అడవి జంతువులు అక్కడ నివసిస్తూ ఉంటాయి. రైలు వచ్చే క్రమంలో చిరుత ఇంజిన్‌ పైకి దూకి ఉంటుందని.. ఆ క్రమంలో హైటెన్షన్ విద్యుత్ (High tension electricity) తీగ తగిలి చిరుత ప్రాణాలు విడిచి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు భావించారు.

ఇది కూడా చదవండి: షాకింగ్ ఘటన.. పక్కింటి వాళ్లు పెళ్లికి పిలవలేదని ఓ వ్యక్తి వింత నిర్వాకం..!

Updated Date - 2023-03-08T14:28:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising