ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Reconstruct of face: ఛిద్రమైన కపాలాన్ని పునర్నిర్మించారు.. మెదడు పనితీరుపై అవగాహనలోని విప్లవాత్మక ముందడుగు!

ABN, Publish Date - Dec 26 , 2023 | 05:26 PM

మెదడు పనితీరుపై అవగాహనలో వైద్యరంగ శాస్త్రవేత్తలు విప్లవాత్మక పురోగతి దిశగా అడుగులు వేశారు. ప్రమాదంలో చెంప భాగం నుంచి మెదడు గుండా కపాలం వెలుపలకు ఇనుప రాడ్ చొచ్చుకెళ్లిన వ్యక్తి ముఖాన్ని కంప్యూటర్‌ స్కాన్ల సహాయంతో సమూలంగా మార్చివేశారు. ఈ విషయాన్ని ఐఎఫ్ఎల్ సైన్స్ (IFL Science) రిపోర్టు పేర్కొంది.

మెదడు పనితీరుపై అవగాహనలో వైద్యరంగ శాస్త్రవేత్తలు విప్లవాత్మక పురోగతి దిశగా అడుగులు వేశారు. ప్రమాదంలో చెంప భాగం నుంచి మెదడు గుండా కపాలం వెలుపలకు ఇనుప రాడ్ చొచ్చుకెళ్లిన వ్యక్తి ముఖాన్ని కంప్యూటర్‌ స్కాన్ల సహాయంతో సమూలంగా మార్చివేశారు. ఈ విషయాన్ని ఐఎఫ్ఎల్ సైన్స్ (IFL Science) రిపోర్టు పేర్కొంది. అమెరికాలోని వెర్మెంటో రాష్ట్రంలో సెప్టెంబరు 13, 1848న ‘ఫినియాస్ గేజ్’ అనే రైల్‌ రోడ్ నిర్మాణ కార్మికుడు తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. కొత్త రైలుమార్గం నిర్మించేందుకు రూట్‌ని క్లియర్ చేసే పనిలో భాగంగా జరిపిన బ్లాస్టింగ్‌లో ఒక ఇనుప కడ్డీ అతడి పుర్రెలో నుంచి బయటకు చొచ్చుకెళ్లింది. ఏకంగా ఒక రంధ్రం పడింది. ఈ ఘటనలో అతడి మెదడులో కొంత భాగం కూడా దెబ్బతిన్నది. ముఖాకృతి కూడా మారిపోయింది.

అయితే తీవ్రమైన గాయమైనప్పటికీ అతడు ప్రాణాలతో బయటపడి 12 ఏళ్లు బతికాడు. ఈ సమయంలో అతడు చురుగ్గా, దాదాపు సాధారణ జీవితాన్ని గడిపాడు. అయితే జ్ఞాపక శక్తి దెబ్బతిన్నది. అయితే కంప్యూటర్ స్కాన్‌లను పరిశీలించిన వైద్య శాస్త్రవేత్తలు అతడి కపాలాన్ని ఫోరెన్సిక్ రీకన్‌స్ట్రక్చన్ చేశారు. కంప్యూటర్‌పై ఫినియాస్ గేజ్ ముఖాన్ని యథాతథంగా పునర్నిర్మించినట్టు ఐఎఫ్ఎల్ సైన్స్ రిపోర్టు పేర్కొంది. ప్రమాదానికి ముందు అతడి ముఖం ఏవిధంగా కనిపించిందో తిరిగి అదే రూపంలోకి మార్చగలిగారని వెల్లడించింది. ఇందుకోసం దెబ్బతిన్న కపాలానికి సంబంధించిన కంప్యూటర్ స్కాన్లను ఉపయోగించారని, తన ముఖ లక్షణాలతో ఫోరెన్సిక్ రీకన్‌స్ట్రక్చన్ చేపట్టారని రిపోర్ట్ పేర్కొంది.


కపాల పునర్మిర్మాణంలో వైద్యశాస్త్రవేత్తలకు సిసెరో మోరెస్ అనే 3డీ డిజైనర్, ఫోరెన్సిక్ నిపుణుడు సాయపడ్డారు. అసలు రూపుతో ముఖాన్ని పునఃసృష్టించడంలో ఆయన సహాయపడ్డారు. ఇందుకు సంబంధించిన ప్రాజెక్ట్ వీడియో క్లిప్‌ను ఆయన యూట్యూబ్‌ వేదికగా షేర్ చేశారు.

ఇదిలావుంచితే.. ఫినియాస్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణ సమయంలో రూట్‌లో అడ్డుగా ఉన్న రాళ్లను పేల్చివేసే ప్రయత్నంలో ప్రమాదానికి గురయ్యాడు. అతడి చేతిలో నుంచి జారిపడిన ఒక ఇనుప రాడ్ గన్‌పౌడర్ తాకిడికి అతడి మీదికే దూసుకొచ్చింది. ఎడమ చెంప ద్వారా కపాలం పైభాగంలో చొచ్చుకెళ్లింది. నాటి స్కానింగులను పరిశీలిస్తే లోహపు రాడ్ పొడవు 1.09 మీటర్లు, వ్యాసం 3.18 సెంటీమీటర్లు, బరువు 6 కేజీలు ఉందని పేర్కొంది. తల భాగం నుంచి దూసుకెళ్లి 10 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పడింది. ఐరన్ రాడ్‌కి రక్తం, మెదడు కణజాలం అంటుకున్నాయి. కాగా నమ్మశక్యం కాని ఈ ఘటనలో బాధితుడు గేజ్ ఒక నెలలో నడవ గలిగాడు. అయితే అతడి జ్ఞాపకశక్తి దెబ్బతిన్నది. చిన్న పిల్లాడి చేష్టలు చేశాడని రిపోర్టులు పేర్కొన్నాయి.

Updated Date - Dec 26 , 2023 | 05:29 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising