ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Frustrated Wife: ఓరి దేవుడో.. గుక్కతిప్పుకోకుండా భర్తతో సహా అత్తింటి వారిని ఉతికారేసింది.. ఈ భార్య ఆగ్రహానికి కారణమేంటో తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-05-20T12:40:21+05:30

ఓ ఇల్లాలికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది (Video fiercely viral).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Viral Video: ఓ ఇల్లాలికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది (Video fiercely viral). అందులో ఆమె గుక్కతిప్పుకోకుండా భర్తతో సహా అత్తింటి వారిని ఉతికారేయడం చూడొచ్చు. ఈ భార్య ఆగ్రహానికి కారణమేంటో తెలుసా? భర్త సోదరి (మరదలు), ఆమె పిల్లలు. ఆ పిల్లలకు స్కూల్ హాలీడేస్ రావడమే ఆలస్యం.. వెంటనే పుట్టింటికి వచ్చేస్తుందట. ఇక అలా వచ్చిన మరదలు (Sister-in law) ఇంట్లో ఒక్కటంటే ఒక్క పని ముట్టుకోదట. యువరాణిలా తాను కూర్చున్న చోట అన్ని అడుగుతుందట. ఇక ఆమె పిల్లలు చేసే అల్లరి అంతఇంత కాదట. వారి కారణంగా రోజంతా తనకు తీరిక లేకుండా పోతుందని ఆమె వాపోయింది.

భర్తను ఉద్దేశిస్తూ.. 'మీ సోదరికి మాత్రమే ఇలా తల్లిగారి ఇంటికి రావాలని ఉంటుందా? నాకు ఉండదా? నేను మాత్రం మనిషిని కాదా? నాకు పిల్లలను తీసుకుని మా పుట్టింటికి వెళ్లాలని ఉంటుంది. కానీ, అది వీలు పడదు. మీ వాళ్లు రావడం.. వారికి సేవలు చేయడంతోనే నా జీవితం తెల్లారిపోతుంది. మీరేమో పనుల పేరుతో రోజంతా బయటే ఉంటారు. ఇక నేను 24 గంటలు ఇంట్లో ఉండాలి. అలా రోజంతా మీ వాళ్లకు సేవలు చేసినా.. చివరికి వారు ఏదో ఒక వంక పెట్టడం చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసం అనేది నాకు అర్థం కాదు. ఇలా ఈ గొడ్డుచాకిరీ ఇంకా ఎన్నాళ్లో బోధపడడం లేదు. మీరు మాత్రం నోరు మెదపరు' అంటూ ఆ గృహిణి గుక్కతిప్పుకోకుండా భర్తతో సహా అత్తింటి వారిని ఉతికారేయడం వీడియోలో ఉంది.

Wonderful Trick: ఈ యువతి టెక్నిక్ అదుర్స్.. అంత లావున్న మహిళ కాస్తా ఒక్క ట్రిక్‌తో ఎంత సన్నగా కనిపిస్తోందో మీరే చూడండి..!

1నిమిషం 22 సెకండ్ల నిడివి కలిగిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటివరకు వీడియోకు 45వేల వ్యూస్ వచ్చాయి. వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'బ్రదర్.. వెంటనే ఆమెను పుట్టినింటికి వెళ్లనివ్వండి. లేదంటే పరిస్థితులు తీవ్రంగా పరిణమించే అవకాశం ఉందని' ఒకరు, 'చాలా ఇళ్లలో కోడళ్ల పరిస్థితి ఇంతే. పాపం వారిని పట్టించుకునేదేవరు. అప్పడప్పుడు ఇలాంటి వాటి ద్వారా వారి పరిస్థితి ఇలా బయటి ప్రపంచాన్ని తెలుస్తుంది. నిజంగా చాలా మంచి వీడియో' అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. అయితే, ఈ వీడియో చూస్తుంటే మాత్రం స్క్రిప్టెడ్‌ వీడియోలా అనిపిస్తుంది.

Horrifying Video: బతికుండగానే జింకను కోతి ఏం చేసిందో చూస్తే.. హృదయం ద్రవిస్తుంది..!

Updated Date - 2023-05-20T12:53:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising