ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వంటింట్లో సడన్‌గా మంటలు రాగానే ఈ భర్త చేసిన పనికి భార్యలో కట్టలు తెంచుకున్న కోపం.. చెప్పు తీసుకుని మరీ..

ABN, First Publish Date - 2023-03-31T16:45:39+05:30

భార్యాభర్తల మధ్య గొడవలు చోటు చేసుకోవడం... మళ్లీ కలిసిపోవడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. చాలా గొడవలు నాలుగు గోడల వరకే పరిమితం అవుతుంటాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. ఇలాంటి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భార్యాభర్తల మధ్య గొడవలు చోటు చేసుకోవడం... మళ్లీ కలిసిపోవడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. చాలా గొడవలు నాలుగు గోడల వరకే పరిమితం అవుతుంటాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. ఇలాంటి చిన్న చిన్న గొడవలు, తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు ఇంటి గడప దాటి.. నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం దంపతుల మధ్య చోటు చేసుకున్న సరదా సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వంటింట్లో సడన్‌గా మంటలు చెలరేగడంతో భర్త చేసిన పనికి భార్యకు కోపం కట్టలు తెంచుకుంటుంది. చివరకు ఏం చేస్తుందంటే..

సోషల్ మీడియాలో దంపతులకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. భార్య (wife) వంటింట్లో ఏదో వంట చేస్తూ బిజీగా ఉంటుంది. మరోవైపు భర్త (husband) వంట పాత్రలు తోమే పనిలో తలమునకలై ఉంటాడు. వారి పాప పక్కనే ఆడుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో భార్య చేతిలో ఉన్న వంటి పాత్రలో సడన్‌గా మంటలు వ్యాపిస్తాయి. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో (fire accident) ఆమె భయపడిపోతుంది. దీన్ని గమనించిన భర్త.. వెంటనే మంటలు ఆపే ప్రయత్నం చేసి, భార్యను రక్షించాల్సి పోయి.. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తాడు.

Married Couple: పాపం ఈ కుర్రాడు.. పెళ్లయిన నెల రోజులకే ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండడు..!

వామ్మో! మంటలు.. అని అరుస్తూ.. పక్కనే ఉన్న కూతుర్ని ఎత్తుకుని బయటికి పరుగులు పెడతాడు. వెళ్తూ వెళ్తూ వంట గది తలుపులు మూసేసి వెళ్తాడు. భర్త అలా వెళ్లగానే.. భార్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ‘‘అంటే..! నేను చచ్చినా నీకు పర్లేదన్నమాట. ఉండు.. నీ పని చెబుతా’’.. అని మనసులో అనుకుంటూ వెంటనే కాలికి ఉన్న చెప్పును (sandals) చేతిలోకి తీసుకుంటుంది. నిన్నూ...! అని కోపంతో అరుస్తూ భర్తకు బుద్ధి చెప్పేందుకు బయటికి వెళ్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు (Funny comments) పెడుతున్నారు.

Viral Video: అయ్యయ్యో.. వరి చేలో ఈ భార్యాభర్తలు ఇలా దొరికిపోయారేంటి..? ఓ వ్యక్తి సీక్రెట్‌గా వీడియో తీయడంతో..

Updated Date - 2023-03-31T16:45:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising