ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amazing Bullet Bike: ఈ బైక్‌కు పెట్రోల్ అస్సలు అవసరం లేదు.. ఇందులోని ప్రతీ పార్టును దేనితో తయారు చేశారో తెలిస్తే అవాక్కవడం ఖాయం..!

ABN, First Publish Date - 2023-03-27T20:08:39+05:30

ప్రస్తుతం పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోవడంతో బైక్ బయటకు తీయాలంటేనే భయమేస్తోంది. పెట్రోల్ రేట్లను తట్టుకోలేక చాలా మంది మధ్యతరగతి జీవులు బైక్‌లను పక్కన పెట్టి ప్రజా రవాణా వ్యవస్థనే ఆశ్రయిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రస్తుతం పెట్రోల్ (Petrol) ధరలు భారీగా పెరిగిపోవడంతో బైక్ బయటకు తీయాలంటేనే భయమేస్తోంది. పెట్రోల్ రేట్లను తట్టుకోలేక చాలా మంది మధ్యతరగతి జీవులు బైక్‌లను పక్కన పెట్టి ప్రజా రవాణా వ్యవస్థనే ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ బైక్ నడపడానికి పెట్రోల్ అవసరం లేదు. అలాగే ఆ బైక్‌ను దేనితో తయారు చేశారో తెలిస్తే మాత్రం షాకవడం ఖాయం. ఆ బైక్‌లోని ప్రతి పార్టును చెక్కతో (wood) తయారు చేశారు. బ్యాటరీతో ఆ బైక్ నడుస్తుంది. (Bullet runs without petrol)

hunter_bebak_kalam అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ అయిన ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఆ బైక్ అచ్చం చూడడానికి బుల్లెట్‌లాగే ఉంది. స్టార్ చేసిన తర్వాత దాని సౌండ్ కూడా బుల్లెట్ సౌండ్‌లానే వస్తోంది. దానిని చెక్కతో తయారు చేశారని వాళ్లు చెబితే తప్ప కనిపెట్టలేనంత అద్భుతంగా ఆ బైక్‌ను తయారు చేశారు. ఆ బైక్ ట్యాంక్, సైలెన్సర్‌ను కూడా చెక్కతోనే తయారు చేశారు. ఆ బైక్ పెట్రోల్ ట్యాంకులో మ్యూజిక్ సిస్టమ్‌ను అమర్చారు.

Viral Video: డ్రైవర్ సీట్లో కూర్చుని డాన్సులు వేస్తున్నాడేంటన్న డౌట్ వచ్చిందా..? ఈ ఒక్క వీడియోతో ఎంత రచ్చ జరిగిందో తెలిస్తే..

ఆ వీడియోను, ఆ బైక్‌ను చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకు ఈ వైరల్ వీడియోను (Viral Video) 40 లక్షల మందికి పైగా వీక్షించారు. అతడి ప్రతిభపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి బైక్ అందుబాటులోకి వస్తే చాలా మంది కష్టాలు తీరిపోతాయని ఒక వ్యక్తి కామెంట్ చేశారు. కాగా, ఆ బైక్ సమర్థతపై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ యువకుడికి ఎవరైనా పారిశ్రామిక వేత్త ఆర్థిక సహాయం చేసి ఆ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకురావాలని చాలా మంది ఆకాంక్షించారు.

Fridge Leaking Water: ఫ్రిడ్జ్‌లోంచి నీళ్లు బయటకు వస్తున్నాయా..? ఈ సింపుల్ స్టెప్స్‌తో లీకేజీ సమస్యకు చెక్ పెట్టండి..!

Updated Date - 2023-03-27T20:08:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising