Viral Video: డ్రైవర్ సీట్లో కూర్చుని డాన్సులు వేస్తున్నాడేంటన్న డౌట్ వచ్చిందా..? ఈ ఒక్క వీడియోతో ఎంత రచ్చ జరిగిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-03-27T19:45:30+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోనే కాదు.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమవుతోంది.

Viral Video: డ్రైవర్ సీట్లో కూర్చుని డాన్సులు వేస్తున్నాడేంటన్న డౌట్ వచ్చిందా..? ఈ ఒక్క వీడియోతో ఎంత రచ్చ జరిగిందో తెలిస్తే..

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోనే కాదు.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమవుతోంది. యూపీ ప్రభుత్వ బస్‌ను (UP roadways) నడిపే డ్రైవర్ కేవలం గేర్ (Gear) మార్చడానికి ఎంత కష్టపడాల్సి వస్తోందో చూస్తే షాకవ్వాల్సిందే. ఆ రాష్ట్ర బస్సులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వ నిర్వహణ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (UPSRTC) రాష్ట్ర వ్యాప్తంగా బస్సు సర్వీసులను నడుపుతూ ప్రజలను గమ్యాస్థానాలకు చేరుస్తోంది. ఆ సంస్థ బస్సుల నిర్వహణ తీరు ఎలా ఉందో ఒక్క వీడియో కళ్లకు కట్టినట్టు చూపించింది. ఆ వీడియోలో ఓ బస్సును నడుపుతున్న డ్రైవర్ గేర్ మార్చడానికి ఆపసోపాలు పడ్డాడు. సీటు పైకి లేచి బలంగా కిందకు పలుసార్లు నెడితే గాని, గేర్ పడలేదు. ఆ ఘటనను ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. యూపీ ప్రభుత్వంపై అందరూ విమర్శలు చేశారు.

Fridge Leaking Water: ఫ్రిడ్జ్‌లోంచి నీళ్లు బయటకు వస్తున్నాయా..? ఈ సింపుల్ స్టెప్స్‌తో లీకేజీ సమస్యకు చెక్ పెట్టండి..!

సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తుండడంతో ఆ వీడియోపై అధికారులు వెంటనే స్పందించారు. ఆ వీడియోలో కనిపించిన డ్రైవర్‌ను వెంటనే సస్పెండ్ చేశారు. ఆ బస్సు అద్భుతమైన కండీషన్‌లో ఉందని, ఎలాంటి గేర్ సమస్యా లేదని, సంస్థ పరువు తీయడానికే డ్రైవర్ అలా ప్రవర్తించాడని అధికారులు చెప్పడం గమనార్హం.

Viral Video: కారులో వెళ్తూ ఓ వ్యక్తి తీసిన వీడియో ఇది.. ఒకే స్కూటీపై నలుగురు యువతులు యమా స్పీడ్‌గా వెళ్తూనే..

Updated Date - 2023-03-27T19:45:30+05:30 IST