ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్య దూరంగా ఉండడంతో.. మరో ఇంటి తలుపు తట్టిన వ్యక్తి.. బయటికి వచ్చిన ఆమె ముందే..

ABN, First Publish Date - 2023-01-14T19:01:27+05:30

కొందరు చేసే చేష్టలు చూస్తే.. కోపం కట్టలు తెంచుకుంటూ ఉంటుంది. ఇంకొందరు మహిళల పట్ల ప్రవర్తించే తీరు చూసినప్పుడు.. ఇలాంటి వారికి ఎన్ని కఠిన శిక్షలు వేసినా తక్కువే అని అనిపిస్తుంటుంది. ఇందుకు..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు చేసే చేష్టలు చూస్తే.. కోపం కట్టలు తెంచుకుంటూ ఉంటుంది. ఇంకొందరు మహిళల పట్ల ప్రవర్తించే తీరు చూసినప్పుడు.. ఇలాంటి వారికి ఎన్ని కఠిన శిక్షలు వేసినా తక్కువే అని అనిపిస్తుంటుంది. ఇందుకు సంబంధించిన ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. ఇటీవల ముంబైలో ఇలాంటి ఘటనే జరిగింది. తన భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఇటీవల భర్త.. ఎదురింటి వద్ద చేసిన పని స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

Viral photos: పండుగ పూట దొంగలకు వినూత్న సందేశం.. అతడి మంచితనాన్ని మెచ్చుకుంటున్న నెటిజన్లు..

ముంబై (Mumbai) బాంద్రాలోని చాపెల్ రోడ్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా అహ్మద్ సయ్యద్ అనే వ్యక్తి భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతను వృత్తి రీత్యా సేల్స్‌మెన్. ఇదిలావుండగా, మనస్పర్థల కారణంగా మూడేళ్ల క్రితం అహ్మద్ భార్య ఇల్లు వదిలి వెళ్లిపోయింది. అప్పటినుంచి అహ్మద్.. ఒక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో అతను ఇంటి ఎదురుగా ఉండే మహిళను (woman) టార్గెట్ చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో జనవరి 4న అతను చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. ఎదురింట్లో మహిళ ఒక్కటే ఒంటరిగా ఉందని తెలుసుకుని, వారింటి వద్దకు వెళ్లాడు.

Viral Video: ప్రియురాలితో కలిసి హోటల్‌కి వెళ్లిన వ్యక్తి.. సడన్‌గా లోపలికి దొంగ రావడంతో ఏం జరిగిందంటే..

తలుపు తట్టిన కొద్ది సేపటికి మహిళ డోర్ తీసింది. దీంతో ఒక్కసారిగా దస్తులు విప్పి నగ్నంగా ఆమె ఎదుట అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల్లో (CC cameras)9 అతడి ముఖం సరిగ్గా కనపడకపోవడంతో గుర్తించడం కష్టమైంది. చివరకు జనవరి 11న ఇంటికి వచ్చిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

తన పెళ్లికి ఐదు మంది మాజీ ప్రియుళ్లను ఆహ్వానించిన వధువు.. నేమ్ ప్లేట్ రాయించి మరీ.. ఆమె చేసిన పని..

Updated Date - 2023-01-14T19:01:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising