తన పెళ్లికి ఐదు మంది మాజీ ప్రియుళ్లను ఆహ్వానించిన వధువు.. నేమ్ ప్లేట్ రాయించి మరీ.. ఆమె చేసిన పని..

ABN , First Publish Date - 2023-01-14T16:35:19+05:30 IST

ప్రేమలో ఉన్న యువతులు వివిధ కారణాల వల్ల చివరికి వేరేకొరిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. తర్వాత ప్రేమికులను మర్చిపోయి.. భర్తతో సంతోషంగా జీవిస్తుంటారు. మరికొందరు మాజీ ప్రియుళ్లను మర్చిపోలేక.. చివరకు..

తన పెళ్లికి ఐదు మంది మాజీ ప్రియుళ్లను ఆహ్వానించిన వధువు.. నేమ్ ప్లేట్ రాయించి మరీ.. ఆమె చేసిన పని..

ప్రేమలో ఉన్న యువతులు వివిధ కారణాల వల్ల చివరికి వేరేకొరిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. తర్వాత ప్రేమికులను మర్చిపోయి.. భర్తతో సంతోషంగా జీవిస్తుంటారు. మరికొందరు మాజీ ప్రియుళ్లను మర్చిపోలేక.. చివరకు వారి వద్దకే వెళ్లడం కూడా చూస్తుంటాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువతి మాత్రం.. ఇందుకు పూర్తి విరుద్ధం. తన పెళ్లికి ఏకంగా ఐదు మంది మాజీ ప్రియుళ్లను ఆహ్వానించింది. వారికి నంబర్ ప్లేజ్ కేటాయించి మరీ తన అభిమానాన్ని చాటుకుంది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..

యువతిని బలవంతంగా లాక్కెళ్లిన వ్యక్తి.. వీడియోలో కాపాడండి అంటూ వేడుకోలు.. మరుసటి రోజు చూస్తే..

చైనా (China) ఓ యువతి పెళ్లికి సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. జనవరి 8న స్థానిక యువతి వివాహం (young woman Marriage) జరిగింది. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. పెళ్లికి తన ఐదు మంది ప్రియుళ్లను ఆహ్వానించడమే.. నెట్టింట ప్రస్తుతం చర్చనీయాంశమైంది. పెళ్లికి ఆహ్వానించడమే కాకుండా.. వారికి ప్రత్యేకంగా టేబుల్‌ను ఏర్పాటు చేయించి, విందు ఇచ్చింది. కుర్చీల మీద 'టేబుల్ ఆఫ్ ఎక్స్-బాయ్‌ఫ్రెండ్స్' అని వారి పేరును రాసి మరీ అంతా అవాక్కయ్యేలా చేసింది. కుర్చీల్లో కూర్చున్న మాజీ ప్రేమికుల్లో కొందరు ఆనందంగా ఉండగా.. మరికొందరు కొంచెం బాధగా కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు (Viral photos) కొడుతున్నాయి.

Viral Video: ప్రియురాలితో కలిసి హోటల్‌కి వెళ్లిన వ్యక్తి.. సడన్‌గా లోపలికి దొంగ రావడంతో ఏం జరిగిందంటే..

వారిని చూడగానే ఆ పెళ్లికొడుకు ఫీలింగ్ ఎలా ఉందో.. అని కొందరు, ఈ యువతి చేసిన పని బాగోలేదంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మాజీ ప్రియుళ్లను పెళ్లికి ఆహ్వానించిన ఘటన గతంలోనూ చోటు చేసుకుంది. 2022లో ఓ చైనా యువతి తన పెళ్లి విందుకు.. ఏకంగా తన తొమ్మిది మంది ప్రియుళ్లను ఆహ్వానించింది. అలాగే గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోనూ ఇలాంటి ఘటన వెలుగుచూసింది.

వివాహితతో కలిసి బ్యాంకు పని మీద బయటికి వెళ్లిన సహోద్యోగి.. తిరుగు ప్రయాణంలో అడవి మధ్యలో చీకటి పడడంతో..

Updated Date - 2023-01-14T16:35:19+05:30 IST