వివాహితతో కలిసి బ్యాంకు పని మీద బయటికి వెళ్లిన సహోద్యోగి.. తిరుగు ప్రయాణంలో అడవి మధ్యలో చీకటి పడడంతో..

ABN , First Publish Date - 2023-01-13T16:34:24+05:30 IST

చాలా మంది మహిళలకు ఇంటా, బయట మాత్రమే కాకుండా పని ప్రదేశాల్లో కూడా వేధింపులు తప్పడం లేదు. మానసికంగా, శారీరకంగా.. ఇలా ఏదో ఒక రకంగా వేధింపులను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఛత్తీస్‌గడ్‌లో ఓ మహిళ విషయంలో..

వివాహితతో కలిసి బ్యాంకు పని మీద బయటికి వెళ్లిన సహోద్యోగి.. తిరుగు ప్రయాణంలో అడవి మధ్యలో చీకటి పడడంతో..
ప్రతీకాత్మక చిత్రం

చాలా మంది మహిళలకు ఇంటా, బయట మాత్రమే కాకుండా పని ప్రదేశాల్లో కూడా వేధింపులు తప్పడం లేదు. మానసికంగా, శారీరకంగా.. ఇలా ఏదో ఒక రకంగా వేధింపులను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఛత్తీస్‌గడ్‌లో ఓ మహిళ విషయంలో ఇలాగే జరిగింది. బ్యాంకులో పని చేస్తున్న ఆమెపై సహోద్యోగి కన్నేశాడు. ఓ రోజు బ్యాంకు పని మీద ఇద్దరూ బయటికి ప్రాంతానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అడవి మధ్యలో వస్తుండగా.. చీకటి పడడంతో దారుణానికి పాల్పడ్డాడు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ప్రేయసి గుర్తుగా వీడియోలు, ఫొటోలను దాచుకున్న ప్రియుడు.. అయితే చివరకు ప్రియురాలి తల్లి అలా అనడంతో..

ఛత్తీస్‌గడ్ (Chhattisgarh) డొంగర్‌ఘర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ప్రదుమ్ కుమార్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ బ్యాంకులో (Private Bank) పని చేస్తున్నాడు. అదే బ్యాంకులో పని చేస్తున్న ఓ వివాహిత (married woman).. ఇతడితో సన్నిహితంగా ఉండేది. అయితే అతను మాత్రం నిత్యం ఆమెను తన దారికి తెచ్చుకోవాలని ఆలోచిస్తూ ఉండేవాడు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు బ్యాంకు పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో వివాహితను తీసుకుని బయటి ప్రాంతానికి వెళ్లాడు. తిరిగి బయలుదేరేసరికి రాత్రి అయింది.

Viral Video: కారులో ఎక్కమంటే ప్రియున్ని ఖంగు తినిపించిన ప్రేయసి.. ట్రాలీ బ్యాగ్‍‌తో ఏం చేసిందో చూడండి..

ఇన్నాళ్లు అవకాశం కోసం ఎదురుచూస్తున్న ప్రదుమ్ కుమార్.. సమయం రావడంతో కావాలనే ఇంకొంచెం ఆలస్యం చేశాడు. దీంతో మధ్యలోకి వచ్చేసరికే రాత్రి అయింది. అడవి మధ్యలో వస్తుండగా.. ఆమెపై ఒక్కసారిగా అఘాయిత్యానికి (Indecent behavior) పాల్పడ్డాడు. బయట ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో వివాహిత కూడా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అంతటితో ఆగని ప్రదుమ్ కుమార్.. రోజూ తనతో శారీరక సంబంధాన్ని కొనసాగించాలని ఒత్తిడి చేయడం మొదలెట్టాడు. ఇలా నెలల తరబడి వేధిస్తుండడంతో (Harassment) చివరకు విసిగిపోయి.. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.

యువతిని బలవంతంగా లాక్కెళ్లిన వ్యక్తి.. వీడియోలో కాపాడండి అంటూ వేడుకోలు.. మరుసటి రోజు చూస్తే..

Updated Date - 2023-01-13T16:41:58+05:30 IST