ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Somireddy: జగన్‌తో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా?: సోమిరెడ్డి

ABN, First Publish Date - 2023-02-28T18:58:18+05:30

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy)పై టీడీపీ (TDP) సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy) విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy)పై టీడీపీ (TDP) సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy) విమర్శలు గుప్పించారు. జగన్.. ఓ ఆర్థిక నేరస్థుడు, అరాచక వాది, నియంత అని సోమిరెడ్డి ఆరోపించారు. జగన్రెడ్డితో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా?, 175 సీట్ల దమ్ము గురించి మాట్లాడుతున్న జగన్తో ఒక్క స్థానంలోనైనా కలిసి వచ్చే పార్టీ ఏదైనా ఉందా? అని సోమిరెడ్డి అన్నారు. నియంత కాబట్టి జగన్తో ఎవరూ కలిసివచ్చే ప్రసక్తే లేదని, దాన్ని జగన్ గొప్పగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని సోమిరెడ్డి మండిపడ్డారు.

రైతులు, వ్యవసాయరంగానికి జగన్మోహన్ రెడ్డి (jagan) చేసింది శూన్యం అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం (YCP Government) గోరంత సాయం చేస్తూ, కొండంత ప్రచారం చేసుకుంటుందన్నారు. మూడున్నరేళ్లలో రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని, రూ.1,45,750 కోట్లు రైతులకు ఖర్చుపెట్టినట్టు ప్రకటనల్లో చెప్పడం పచ్చిఅబద్ధమన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకు వ్యవసాయ, అనుబంధ రంగాలకు బడ్జెట్లో కేటాయించిన నిధులు.. ఖర్చుపెట్టిన నిధులపై పూర్తి వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేయగల దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. బటన్ నొక్కుడు పేరుతో జగన్మోహన్ రెడ్డి రైతుల గొంతు నొక్కుతున్నారని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రచార పిచ్చి పీక్స్‌కి చేరిందని సోమిరెడ్డి విమర్శించారు.

Updated Date - 2023-02-28T19:01:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!