ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Freelance Work Permits: యూఏఈ మరో కీలక నిర్ణయం.. 2023 మూడో త్రైమాసికం నుంచి ప్రత్యేక వర్క్ పర్మిట్లు

ABN, First Publish Date - 2023-03-17T08:38:45+05:30

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2023 మూడో త్రైమాసికం నుంచి ప్రత్యేక వర్క్ పర్మిట్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. దేశంలో అన్ని నైపుణ్యాలు ఉన్నవారు ఫ్రీలాన్స్ ఉద్యోగాలు చేసుకునేందుకు వీలుగా ఫ్లెక్సిబుల్ వర్క్ పర్మిట్లు (Flexible Work Permit ) తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఈ ఫ్రీలాన్స్ వర్క్ పర్మిట్లతో (Freelance Work Permits) యూఏఈలో లేదా ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచి అయినా పని చేయడానికి వీలు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎమిరేటైజేషన్ మినిస్టర్ అబ్దుల్ రెహ్మన్ అల్ అవార్ (Abdulrahman Al Awar) మాట్లాడుతూ.. అన్ని నైపుణ్య స్థాయిల వారి కోసం ఫ్రీలాన్సింగ్ వర్క్ పర్మిట్లను పరిచయం చేస్తున్నాం. అధిక నైపుణ్యం కలిగిన వ్యక్తులతో పాటు తక్కువ నైపుణ్యం ఉన్నవారు కూడా తమ కోసం పని చేయడానికి, ఇతరులతో కలిసి పని చేయడానికి అనువైన వర్క్ పర్మిట్లను కలిగి ఉంటారు అని బుధవారం దుబాయిలో (Dubai) జరిగిన రిమోట్ ఫోరం సమావేశంలో అన్నారు.

ఇటువంటి సౌకర్యవంతమైన పని అవకాశాలతో వచ్చే ఏడాది నాటికి 24వేల ఉద్యోగాలు సృష్టించడమే తమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం మినిస్ట్రీలో 200 మంది 'రిమోట్‌'గా పని చేస్తున్నారని, వీరిలో పురుషులు, మహిళలు ఉన్నట్లు తెలిపారు. ఇక తాజాగా ప్రకటించిన ఫ్రీలాన్స్ వర్క్ పర్మిట్ల ద్వారా 24వేల ఉద్యోగావకాశాలు కల్పించి శ్రామిశక్తిని పెంచుకోవడంతో పాటు మూలధననాన్ని సమకూర్చుకోవడం జరుగుతుందన్నారు. ఇదిలాఉంటే.. గతేడాది ప్రకటించిన కొత్త వీసా పథకాలు, రెసిడెన్సీ సంస్కరణలపై యూఏఈ భారీ ఆశలే పెట్టుకుంది. వీటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులు, నైపుణ్యం కలిగిన కార్మికులను ఆకర్షించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తోంది.

ఇది కూడా చదవండి: కెనడాలో 700 మంది భారతీయ విద్యార్థులకు బహిష్కరణ నోటీసులు.. కారణమేంటంటే..

Updated Date - 2023-03-17T08:38:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising