ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

H-1B Visa: కొలువులు కోల్పోయిన వారు దేశాన్ని వీడాల్సిన గడువు ముంచుకొస్తోంది.. ఆందోళనలో వేలాదిమంది భారతీయ టెకీలు

ABN, First Publish Date - 2023-03-19T07:47:38+05:30

అమెరికాలో కొలువులు కోల్పోయిన హెచ్‌-1బీ వీసాదారులకు దేశాన్ని వీడాల్సిన సమయం సమీపిస్తోందని ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా అండ్‌ ఇండియన్‌ డయాస్పోరా స్టడీస్(ఎఫ్ఐఐడీఎస్‌) తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నిరుద్యోగ హెచ్‌-1బీ వీసాదారులకు సమయం లేదు!

వాషింగ్టన్‌, మార్చి 18: అమెరికాలో కొలువులు కోల్పోయిన హెచ్‌-1బీ వీసాదారులకు దేశాన్ని వీడాల్సిన సమయం సమీపిస్తోందని ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా అండ్‌ ఇండియన్‌ డయాస్పోరా స్టడీస్(ఎఫ్ఐఐడీఎస్‌) తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా చట్టాల ప్రకారం, ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల్లో హెచ్‌-1బీ వీసాదారులు దేశాన్ని విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుందని వివరించింది. ‘‘ప్రస్తుత పరిస్థితి వేలాదిమంది భారతీయ టెక్‌ ఉద్యోగులను, వారి కుటుంబాలను ప్రభావితం చేస్తోంది. ఇక్కడి పుట్టిన వారి బిడ్డలను కూడా ఉద్యోగులు స్వదేశానికి తీసుకెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో అమెరికా చట్టసభ సభ్యులతో, యంత్రాంగంతో చర్చిస్తున్నాం. గడువును 60 నుంచి 180 రోజులకు పెంచాలని అమెరికా పౌరసత్వ-వలససేవల సంస్థ(యూఎ్‌ససీఐఎస్‌) భావిస్తోంది. అయితే. దానికి సమయం పడుతుంది. ఈలోపు దేశాన్ని వీడటం తప్ప భారత ఉద్యోగులకు వేరే మార్గం లేకుండా పోయింది. దేశాన్ని వీడే కాలపరిమితిని ప్రస్తుతానికి కొంతమేర పెంచాలని యూఎ్‌ససీఐఎస్‌, హోంల్యాండ్‌ సెక్యూరిటీ శాఖ(డీహెచ్‌ఎ్‌స)లకు మేం విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని ఎఫ్‌ఐఐడీఎస్‌ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: వామ్మో.. నిత్యానంద లీలలు మాములుగా లేవుగా.. ఏకంగా అమెరికాలోని 30 నగరాలకే ఎసరు..!

Updated Date - 2023-03-19T07:49:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising