ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Facebook Friends to Lovers: భారత యువకుడి కోసం ఎల్లలు దాటిన స్వీడిష్ యువతి..!

ABN, First Publish Date - 2023-01-30T11:47:38+05:30

ప్రేమకు ఎల్లలు లేవని మరోసారి నిరూపితమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ప్రేమకు ఎల్లలు లేవని మరోసారి నిరూపితమైంది. ప్రేమకు జాతి, మతం, కులం, దేశం హద్దులు లేవంటూ స్వీడిష్ యువతి (Swedish Woman).. భారత యువకుడు (Indian Man) పెళ్లితో ఒక్కటయ్యారు. ఒకరినొకరు ఇష్టపడిన ఈ జంట పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ పెళ్లి (Love Marriage) చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డెహ్రాడూన్‌లో బీటెక్ పూర్తి చేసిన పవన్ కుమార్ ఓ ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తు్న్నాడు. ఈ క్రమంలో అతడికి ఫేస్‌బుక్ ద్వారా 2012లో స్వీడిష్ అమ్మాయి క్రిస్టెన్ లీబర్ట్‌తో పరిచయం ఏర్పడింది. దాంతో ఇద్దరు సోషల్ మీడియా వేదికగా చాట్ చేసుకునేవారు.

కొన్నాళ్లకు ఈ పరిచయం కాస్త ప్రేమగా (Love) మారింది. అంతే.. పవన్ కోసం క్రిస్టెన్ ఏకంగా తన దేశాన్ని విడిచి వచ్చేసింది. పవన్ స్వస్థలం యూపీలోని ఎటాహ్‌కి వచ్చింది. తాజాగా ఈ ప్రేమ జంట పెళ్లితో ఒక్కటైంది. అక్కడి ఓ స్థానిక పాఠశాలలో ఇరువురు కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. పూర్తిగా భారతీయ సంప్రదాయం ప్రకారం ఈ వివాహమైంది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఇరువురు ఇలా పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ పెళ్లి (Marriage) తాలూకు వీడియో ఒకటి బయటకు రావడంతో ఇప్పుడు అది వైరల్ అవుతోంది. ఇక క్రిస్టెన్ లీబర్ట్‌ మాట్లాడుతూ.. "నేను ఇంతకుముందు ఇండియాకు వచ్చాను. నాకు భారత్ అంటే చాలా ఇష్టం. ఈ వివాహంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-01-30T11:58:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising