ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Oman: విదేశీ పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరుస్తున్న ఒమాన్.. భారీగా ఇన్వెస్టర్ రెసిడెన్సీ కార్డుల జారీ!

ABN, First Publish Date - 2023-08-23T08:25:36+05:30

గల్ఫ్ దేశం ఒమాన్ (Oman) విదేశీ పెట్టుబడుదారులకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. భారీ విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా వలసదారులకు రెసిడెన్సీతో పాటు ఇతర పలు విషయాల్లో వెసులుబాటులు కల్పిస్తోంది.

మస్కట్: గల్ఫ్ దేశం ఒమాన్ (Oman) విదేశీ పెట్టుబడుదారులకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. భారీ విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా వలసదారులకు రెసిడెన్సీతో పాటు ఇతర పలు విషయాల్లో వెసులుబాటులు కల్పిస్తోంది. దీనిలో భాగంగా 2021లో ఇన్వెస్టర్ రెసిడెన్సీ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా 2023 ఆగస్టు 21 వరకు ఏకంగా 2700 ఇన్వెస్టర్ రెసిడెంట్ కార్డుల (Investor Resident Cards) ను జారీ చేసినట్లు ఆ దేశ వాణిజ్య, పరిశ్రమ మరియు పెట్టుబడి ప్రోత్సాహక మంత్రిత్వశాఖ (Ministry of Commerce, Industry and Investment Promotion) తాజాగా వెల్లడించింది. ఇక ఈ రెసిడెన్సీ ప్రోగ్రామ్ ద్వారా 10 ఏళ్లు, 5 ఏళ్ల విభాగాలతో పాటు రిటైర్ అయిన వారు అనే మూడు కేటగిరీల వారీగా రెసిడెన్సీ కార్డులను ఇస్తోంది.

విదేశీయులు ఇన్వెస్టర్ రెసిడెన్సీ కార్డులు పొందడానికి ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://tejarah.gov.om/InvestorResidency ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇక ఇన్వెస్టర్ రెసిడెన్సీదారులు (Investor Residency Holders) విమానాశ్రయాలతో పాటు పోర్టులలో ఇన్వెస్టర్ రెసిడెన్సీ కార్డు హోల్డర్ల కోసం ప్రత్యేక కౌంటర్‌మార్క్‌ను వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. బంధువులు, సందర్శకులకు వీసాలు జారీ చేయడానికి అనుమతి ఉంటుంది. అలాగే సుల్తానేట్‌లో ఆర్థిక కార్యాకలాపాలు, వర్క్ చేసుకోవడానికి కూడా అనుమతిస్తారు. ఇన్వెస్టర్ రెసిడెన్సీ కార్డు హోల్డర్లు ప్రైవేట్ వర్క్ వీసాను పొందేందుకు స్పాన్సర్ అవసరం ఉండదు. అంతేగాక ప్రైవేట్ వృత్తులలో డొమెస్టిక్ వర్కర్లను కూడా తీసుకురావచ్చు. ఇక విదేశీ పెట్టుబడిదారుల కోసం మస్కట్, సలాలా అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఇన్వెస్ట్ ఇన్ ఒమాన్ లాంజ్ సర్వీసులను కూడా ప్రారంభించింది.

Kuwait: నిన్న ట్రాఫిక్ ఫైన్.. ఇవాళ ఎలక్ట్రిసిటీ బిల్.. అసలు కువైత్‌లో ఏం జరుగుతోంది..?

Updated Date - 2023-08-23T08:26:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising