ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI TDP UK: లండన్‌లో అంగరంగ వైభవంగా శకపురుషుని శతజయంతి వేడుకలు

ABN, First Publish Date - 2023-05-30T07:55:54+05:30

ఎన్నారై టీడీపీ యూకే బృందం (NRI TDP UK Team) సహకారంతో టీడీపీ యూకే ప్రెసిడెంట్ వేణు మాధవ్ పోపూరి ఆధ్వర్యంలో లండన్ నగరంలో అన్నగారు ఎన్టీఆర్ శతజయంతి సంబరాలు అంబరాన్నంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఎన్నారై టీడీపీ యూకే బృందం (NRI TDP UK Team) సహకారంతో టీడీపీ యూకే ప్రెసిడెంట్ వేణు మాధవ్ పోపూరి ఆధ్వర్యంలో లండన్ నగరంలో అన్నగారు ఎన్టీఆర్ శతజయంతి సంబరాలు అంబరాన్నంటాయి. అన్నగారి జీవిత విశేషాలతో ఆహతుల్ని ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా అన్నగారి విగ్రహావిష్కరణ, 100 చదరపు అడుగుల కేక్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

వినాయక శ్లోకంతో మొదలయిన కార్యక్రమం, అన్నగారితో అనుబంధం ఉండి పెద్దయనతో కలిసి పనిచేసిన లండన్ సీనియర డాక్టర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ఆయనతో తమకున్న అనుబంధాన్ని, అనుభవాలని పంచుకున్నారు. ఒక నటుడిగా మొదలయి తెలుగు జాతి ఇలావేల్పుగా అన్నగారు ఎదిగిన ప్రస్థానంలో తమకు ఎదురైన అనుభూతుల్ని పంచుకున్నారు.

1000 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 వరకు ఆహుతుల్ని కట్టిపడేసింది. అన్నగారి జీవిత విశేషాలు, ఆయన సాధించిన విజయాలు, తెలుగు జాతికి అందించిన ఫలాల వివరాలతో కూడిన ప్రెజెంటేషన్ ఆహుతల్ని విశేషంగా ఆకట్టుకుంది.

కార్యక్రమానికి రత్నశ్రీ ఉప్పాల వ్యాఖ్యాతగా వ్యవహరించగా అన్నగారి పాటలతో కూడిన మెడ్లీ డాన్స్ (Medley Dance) యువతని ఉర్రూతలూగించింది. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు నేలని లండన్‌లో ఆవిష్కరింప చేసినట్లయింది.

NTR ఆశయాలు, ఆలోచినల్ని నేటి తరానికి పరిచయం చేస్తూ, ఆయన స్పూర్తితో నేటి తరం మరిన్ని విజయాల్ని అందుకునేలా ప్రజల్లో చైతన్యం నింపటం కోసం ఎన్నారై టీడీపీ యూకే (NRI TDP UK) చేపడుతున్న, చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాలికని ఈ సందర్బంగా పంచుకున్నారు.

అన్నగారు ఇచ్చిన ఆత్మ గౌరవం నుంచి చంద్రబాబు నింపిన ఆత్మ విశ్వాసం వరకు తెలుగుజాతి ప్రస్థానం మీద చేసిన ప్రసంగాలు యువతని ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా అన్నగారి జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా తెలుగు రుచులతో ఏర్పాటు చేసిన విందు భోజనాలు వేడుకలకి మరింత పండగ శోభని అద్దాయి.

తెలుగు ప్రజల అస్తిత్వానికి సూచిక అయిన అన్నగారి శత జయంతి వేడుకలకి బ్రిటన్ వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలన్నీ మొట్టమొదటి సారి ఏకతాటి మీదకి రావటం శుభసూచకం.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పంజాబీ డోలే నృత్యాలు, బాణా సంచా వేడుకలు & శత జయంతికి సూచికగా 100 ఎన్‌టీఆర్ ఆకారంలో అభిమానులు చేసిన మానవహారం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

NRI TDP UK Team సహకారంతో టీడీపీ యూకే ప్రెసిడెంట్ వేణు మాధవ్ పోపూరి ఆధ్వర్యంలో లండన్ నగరంలో అన్నగారి శతజయంతి వేడుకలు, టీడీపీ మినీ మహానాడు వేడుకలు అంబరాన్ని అంటాయి.

Updated Date - 2023-06-01T07:32:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising