ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TANA: చిత్ర గానంతో పరవశించనున్న తానా మహాసభలు

ABN, First Publish Date - 2023-06-09T08:28:47+05:30

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

TANA Mahasabhalu: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి తెలిపారు. సినీ సంగీత విభావరులను కూడా ఏర్పాటు చేశారు. ప్రముఖ నేపథ్య గాయని, దక్షిణ భారత నైటింగేల్‌గా పిలిచే పద్మభూషణ్ కె.ఎస్. చిత్ర తానా మహాసభలకు రానున్నారు. తమ పాటలతో అందరినీ ఆమె పరవశింపజేయనున్నారు. తెలుగు సినిమాల్లో ఎన్నో హిట్ చిత్రాలకు పాటలను పాడిన చిత్ర రాక సినీ ప్రియులకు ఆనందాన్ని కలిగిస్తున్నడంలో సందేహం లేదు. ఇంకేందుకు ఆలస్యం. మీరు కూడా తానా మహాసభలకు వచ్చి చిత్ర పాటల గానాన్ని వినండి. మహాసభల కోసం మీ పేర్లను https://tanaconference.org/event-registration.html లింక్ ద్వారా రిజిష్టర్ చేసుకోవాలని తానా తెలిపింది.

Updated Date - 2023-06-09T08:28:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising