Home » TANA
ఉత్తరఅమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్యవిభాగం – ‘తానా ప్రపంచసాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ప్రముఖ సినీకవి, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్రసాహిత్యాన్ని సిరివెన్నెల కుటుంబ సభ్యుల సహకారంతో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన మొత్తం ఆరు సంపుటాలలో ముద్రించి సిరివెన్నెల అభిమానులకు, సాహితీ ప్రియులకు ఇటీవలే కానుకగా అందించిన సంగతి విదితమే.
2023-25 కాలానికి గానూ 'తానా' తరఫున డెట్రాయిట్‌లోని శ్రీ వేంకటేశ్వర ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా బేతంచర్ల ప్రసాద్ నియమితులయ్యారు.
అమెరికాలోని పేదవాళ్ళకు సహాయం చేసేందుకు వీలుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షుడు డా. నవనీత కృష్ణ గొర్రెపాటి ప్రవేశపెట్టిన 'తానా బ్యాక్ ప్యాక్' పథకంలో భాగంగా డెట్రాయిట్‌లోని మౌండ్ పార్క్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌లను పంపిణీ చేశారు.
ప్రముఖ సినీగీత రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుండి జాలువారిన సినీ, సినీయేతర సాహిత్యాలను ఆరు సంపుటాలను ప్రచురించినట్లు తానా సాహిత్య విభాగం- తానా ప్రపంచ సాహిత్య వేదిక వెల్లడించింది.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA), వాల్‌గ్రీన్స్ (Walgreens) వారు అక్టోబర్ 7న (శనివారం) అట్లాంటాలోని తామా కార్యాలయంలో ‘ఉచిత టీకాల డ్రైవ్’ నిర్వహించారు.
తానా ద్వారా తెలుగురాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని 'తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి' వెల్లడించారు. ఎస్.వి.ఎస్ కళ్యాణమండపంలో పుట్టగుంట వీరభద్రరావు జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు 'తానా ఫౌండేషన్ ట్రస్టీ పుట్టగుంట సురేష్' 100 మంది మహిళలకు 100 కుట్టు మిషన్లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేతుల మీదుగా అందజేశారు.
గతంలో 'తానా' ఫౌండేషన్ ట్రస్టీగా భక్తా బల్లా మిగిలిన రెండేళ్ల పదవీ కాలాన్నితాను అభిమానించే ప్రియమైన నాయకుడు జయరాం కోమటి సలహాతో 'తానా' శ్రేయస్సు కొరకు త్యాగం చేసిన విషయం తెలిసిందే.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తానా న్యూ ఇంగ్లండ్ ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
'తానా' బోర్డుకి జరిగిన ఎన్నికలలో డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి బోర్డ్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారితో పాటు కార్యదర్శిగా లక్ష్మి దేవినేని, కోశాధికారిగా జనార్దన్ (జూనీ) నిమ్మలపూడి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.