Share News

TANA: తానా ఫౌండేషన్, ‘స్వేచ్ఛ’ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

ABN , Publish Date - Apr 08 , 2024 | 05:39 PM

గచ్చిబౌలిలో 'తానా ఫౌండేషన్', 'స్వేచ్ఛ' సంయుక్తంగా నిర్వహించిన మెగా వైద్యశిబిరంలో 600 మందికి ఉచితంగా వైద్యసేవలు అందించారు.

TANA: తానా ఫౌండేషన్, ‘స్వేచ్ఛ’ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

  • శశికాంత్‌ వల్లేపల్లి ఉదారత

గచ్చిబౌలిలో 'తానా ఫౌండేషన్', 'స్వేచ్ఛ' సంయుక్తంగా నిర్వహించిన మెగా వైద్యశిబిరంలో (TANA Foundation- Swecha Medical Camp) 600 మందికి ఉచితంగా వైద్యసేవలు అందించారు. ప్రతి నెల మొదటి ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. క్యాంప్ నిర్వహణలో తానా ఫౌండేషన్ సహకారం అందించడం ఇది ఐదవసారి. ఈ వైద్యశిబిరానికి వల్లేపల్లి శశికాంత్‌, ఆయన భార్య ప్రియాంక వల్లేపల్లి స్పాన్సర్లుగా వ్యవహరించారు. మెగా వైద్య శిబిరాలకు వస్తున్న స్పందన, స్వేచ్ఛ వాలంటీర్లు అందిస్తున్న సేవలు చూసి శశికాంత్‌ వల్లేపల్లి అందరికీ అభినందనలు తెలియజేశారు.

USA: 99 ఏళ్ల భారతీయ మహిళకు అమెరికా పౌరసత్వం

2.jpg


ఈ క్యాంప్‌‌కు గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మియాపూర్‌ తదితర ప్రాంతాల్లోని స్లమ్స్‌ నుంచి దాదాపు 600 మంది హాజరయ్యారు. ఈ మెడికల్‌ క్యాంప్‌ కోసం 26 మంది వైద్యుల బృందం పని చేస్తుంది. వీరంతా రొటేషన్‌ పద్ధతిలో హాజరవుతుంటారని తెలిపారు. ఆర్థోపెడిక్‌, డయాబెటిక్‌, గైనకాలజీ, పీడీయాట్రిషన్‌ ఇంకా ఇతర విభాగాలకు సంబంధించిన డాక్టర్లు కన్సల్టెన్సీ సేవలు అందించారు. పేషెంట్లు అందరికీ నెలకు సరిపడా మందులను ఉచితంగా అందించారు. ఈ క్యాంప్‌‌లో రెగ్యులర్‌‌గా కళ్లకు సంబంధించిన స్పెషలిస్ట్‌ సేవలు అందిస్తున్నారు. తానా ఫౌండేషన్ తరపున సంస్థ చైర్మన్ వల్లేపల్లి శశికాంత్ క్యాంప్ నిర్వహణను పర్యవేక్షించారు. విజయవంతంగా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించిన అందరినీ తానా అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు అభినందించారు.

5.jpg3.jpg4.jpgమరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 08 , 2024 | 05:41 PM