ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: భారతీయ ఉపాధ్యాయురాలిపై బ్రిటన్ స్కూల్స్ రెండేళ్ల బ్యాన్.. ఇంతకీ ఆమె చేసిన నేరమేంటంటే..

ABN, First Publish Date - 2023-06-07T08:44:09+05:30

బ్రిటన్‌లోని (Britain) స్కూల్స్ భారత సంతతి ఉపాధ్యాయురాలిపై రెండేళ్ల బ్యాన్ విధించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: బ్రిటన్‌లోని (Britain) స్కూల్స్ భారత సంతతి ఉపాధ్యాయురాలిపై రెండేళ్ల బ్యాన్ విధించాయి. భారత్‌కు చెందిన దీప్తి పటేల్ (Dipti Patel) అనే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌ను అక్కడి పాఠశాలలు ఇలా రెండేళ్ల పాటు నిషేధించాయి. కాగా, ఆమె తనపై ఉన్న మోసపోరిత ఆరోపణలను దాచిపెట్టి ఈ ఉద్యోగంలో చేరడంతో యూకే స్కూల్స్ ఈ నిర్ణయం తీసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. దీప్తి పటేల్ 2018లో లండన్ నుంచి బోల్టన్‌కు మకాం మార్చింది. తన ఇంటిలోకి తుపాకీతో వచ్చిన కొందరు దుండగులు దోపిడీకి పాల్పడడంతో తాను ఇల్లు మారినట్లు ఆమె ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో అబద్ధం చెప్పింది. ఇక తన ఇంట్లో చోరీ జరిగిందని చెప్పడానికి ఆధారంగా దొంగిలించిన వస్తువులకు తన ఫ్యామిలీ బీమా క్లెయిమ్ (Insurance Claim) చేసినట్లు ఆమె స్కూల్ యాజమాన్యానికి తెలిపింది. అయితే, ఇటీవల విచారణలో ఆమె బీమా క్లెయిమ్ నకిలీదని తేలింది. దీప్తిపైనే దోపిడీ కేసు ఉన్నట్లు గుర్తించారు.

నిజానికి ఆమె దోషిగా తేలేంత వరకు పాఠశాలకు అభియోగాల గురించి చెప్పలేదు. వాస్తవానికి ఆమెను ఇటీవల బీమా క్లెయిమ్ కేసు విషయమై న్యాయస్థానానికి పిలిచినప్పుడు కూడా పాఠశాలలో (School) అబద్ధం చెప్పి కోర్టుకు వెళ్ళింది. అయితే, ఆమె అసలు బాగోతం తాజాగా బయటపడటంతో ప్రస్తుత స్కూల్ యాజమాన్యం షాకైంది. వెంటనే దీప్తి విషయమై టీచర్ల దుష్ప్రవర్తనపై చర్యలు తీసుకునే ప్రత్యేక ఏజెన్సీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆమెపై ఓ ప్రత్యేక ప్యానెల్ దర్యాప్తు చేసింది. దీనిలో భాగంగా ఆమె ఒక టీచర్‌ నుంచి సాధారణంగా ఆశించిన ప్రమాణాలను అందుకోలేదని గుర్తించింది. దాంతో ప్యానెల్ దీప్తిని రెండేళ్లపాటు బోధించకుండా బ్యాన్ చేసింది. ఇక ఈ నిషేధం ప్రకారం ఆమె వచ్చే రెండేళ్లపాటు బ్రిటన్‌లోని ఏ పాఠశాలలో గానీ, కళాశాలలో బోధించేందుకు వీలు లేదు.

Indian Priest: సింగపూర్‌లో భారతీయ పూజారి బాగోతం.. డబ్బు కావాల్సినప్పుడల్లా ఏం చేశాడంటే..

Updated Date - 2023-06-07T08:44:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising