ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: అయ్యో పాపం.. నెల క్రితం వేకేషన్స్ కోసం స్వదేశానికి వచ్చిన భారతీయ నర్సు.. ఇంతలోనే తీవ్ర విషాదం..!

ABN, First Publish Date - 2023-03-15T09:20:36+05:30

వేకేషన్స్ కోసం స్వదేశానికి రావడమే భారతీయ నర్సు (Indian Nurse) పట్ల శాపంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఎన్నారై డెస్క్: వేకేషన్స్ కోసం స్వదేశానికి రావడమే భారతీయ నర్సు (Indian Nurse) పట్ల శాపంగా మారింది. ఓ రోడ్డు ప్రమాదం (Road Accident) ఆమె జీవితాన్ని చిదిమేసింది. దీంతో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. కువైత్‌లోని జబేర్ ఆస్పత్రిలో (Jaber Hospital in Kuwait) నర్సుగా పని చేస్తున్న 40ఏళ్ల జస్టీ రోజ్ (Justi Rose) తాజాగా ఆమె సొంత రాష్ట్రం కేరళలో (Kerala) జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె ప్రయాణిస్తున్న కారు చంగనస్సేరి వద్ద రోడ్డు ప్రమాదానికి గురికావడంతో అక్కడికక్కడే చనిపోయింది. రోజ్ ఆమె భర్త జెసీన్ ఇద్దరు కూడా కువైత్‌లోనే (Kuwait) పని చేస్తున్నారు.

జెసీన్ అక్కడి హ్యూందాయ్ కువైత్‌లో ఉద్యోగి. ఫిబ్రవరి 28న ఈ దంపతులు తమ ఇద్దరు పిల్లలు జోవన్, జోనాలతో కలిసి వేకేషన్స్ (Vacations) కోసం స్వదేశానికి వచ్చారు. ఇంతలోనే ఈ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోజ్ మృతితో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. ఆమె మృతిపట్ల జబేర్ హాస్పిటల్ యాజమాన్యం కూడా దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ఒక మంచి ఉద్యోగిని సేవలను కోల్పోవడం బాధగా ఉందని విచారం వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి: ప్రవాసులకు మరో ఝలక్.. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో భారీగా వర్క్ పర్మిట్ల కోత..!

Updated Date - 2023-03-15T09:20:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising