ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian: ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలోకి భారతీయుడు.. మనోడిపై రూ.2కోట్ల రివార్డు కూడా.. ఇంతకీ అతడు చేసిన నేరమేంటంటే..

ABN, First Publish Date - 2023-06-02T10:31:16+05:30

భారత సంతతికి చెందిన భద్రేష్ పటేల్‌ను (Bhadresh Patel) అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (Federal Bureau of Investigation) తన మోస్ట్ వాంటెడ్ జాబితాలోకి చేర్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: భారత సంతతికి చెందిన భద్రేష్ పటేల్‌ను (Bhadresh Patel) అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (Federal Bureau of Investigation) తన మోస్ట్ వాంటెడ్ జాబితాలోకి చేర్చింది. అతని కోసం 2017 నుంచి ఎఫ్‌బీఐ వెతుకుతోంది. గుజరాత్‌ రాష్ట్రం (Gujarat) విరాంగామ్‌కు చెందిన భద్రేష్ పటేల్‌ (26).. 2015 ఏప్రిల్‌లో మేరీల్యాండ్‌లో తన భార్యను హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే పటేల్‌ను టాప్ 10 మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చిన ఎఫ్‌బీఐ అతనిపై 2,50,000 డాలర్ల (రూ.2.05 కోట్ల) రివార్డ్‌ కూడా ప్రకటించింది.

ఇక ఎఫ్‌బీఐ మనోడిని కోల్డ్ బ్లడెడ్ హంతకుడిగా, అత్యంత ప్రమాదకరమైన నేరస్తుడిగా అభివర్ణించింది. స్వదేశానికి తిరిగి వెళ్లిపోదామని భార్య పలక్ (Palak) తరచూ ఒత్తిడి చేయడంతో పటేల్‌ ఆమెను హత మార్చినట్లు తెలుస్తోంది. మేరీల్యాండ్‌ హనోవర్‌లోని డంకిన్ డోనట్స్ స్టోర్‌లో భార్యను విచక్షణారహితంగా కొట్టి చంపేశాడు. ఈ నేరానికి గాను 2015 ఏప్రిల్ 13న మేరీల్యాండ్‌ డిస్ట్రిక్ట్ కోర్టు (Maryland District Court) అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అంతేగాక భారత సంతతికి (Indian Origin) చెందిన మానవ అక్రమ రవాణా ముఠా ద్వారా భద్రేష్ పటేల్ అక్రమంగా కెనడాలోకి ప్రవేశించినట్లుగా గుర్తించింది.

Indian Priest: సింగపూర్‌లో భారతీయ పూజారి బాగోతం.. డబ్బు కావాల్సినప్పుడల్లా ఏం చేశాడంటే..

అలాగే విచారణ నుంచి తప్పించుకోవడానికి చట్టవిరుద్ధంగా విమానాలను సైతం వాడాడు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 20, 2015న యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్, డిస్ట్రిక్ట్ ఆఫ్ మేరీల్యాండ్, బాల్టిమోర్ కోర్టులు అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశాయి. అప్పటి నుంచి పటేల్ కోసం మేరీల్యాండ్ పోలీసులు వెతికారు. కానీ, వారికి చిక్కలేదు. దాంతో ఈ కేసును 2017లో ఎఫ్‌బీఐకి (FBI) అప్పగించారు. అప్పటి నుంచి ఎఫ్‌బీఐ అతడి కోసం వెతుకుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల భద్రేష్ పటేల్‌ పేరును తన మోస్ట్ వాంటెడ్ జాబితాలోకి చేర్చింది.

Dubai Visit Visa: విదేశీ విజిటర్లకు యూఏఈ బిగ్ షాక్..!

Updated Date - 2023-06-02T10:51:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising