ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Qatar: ఆ కార్డు హోల్డర్లకు ఖతార్ బంపరాఫర్.. వచ్చే ఏడాది వరకు ఫ్రీ ఎంట్రీ..!

ABN, First Publish Date - 2023-01-31T11:21:59+05:30

గల్ఫ్ దేశం ఖతార్ (Qatar ) ఫిఫా వరల్డ్ కప్ 2022 (FIFA World Cup 2022) సందర్భంగా విదేశీయులకు ప్రత్యేక ఎంట్రీ కార్డులను జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోహా: గల్ఫ్ దేశం ఖతార్ (Qatar ) ఫిఫా వరల్డ్ కప్ 2022 (FIFA World Cup 2022) సందర్భంగా విదేశీయులకు ప్రత్యేక ఎంట్రీ కార్డులను జారీ చేసింది. 'హయ్యా కార్డు' (Hayya Card) పేరిట వీటిని విదేశీ క్రీడాభిమానులకు జారీ చేసింది. వీటితో 2022 నవంబర్ 1 నుంచి 2023 జనవరి 23 మధ్య ఖతార్‌ను సందర్శించే అవకాశం ఇచ్చింది. దాదాపు మూడు నెలల వ్యవధితో పాటు మల్టీ ఎంట్రీలకు వెసులుబాటు కల్పించింది. తాజాగా ఈ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఖతార్ అంతర్గత మంత్రిత్వశాఖ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఒక విధంగా హయ్యా కార్డు హోల్డర్లకు తీపి కబురు అందించిందని చెప్పాలి. ఈ కార్డు వ్యాలిడిటీని ఏకంగా ఏడాది పాటు పొడిగించింది. 2023 జవనరి 30 నుంచి 2024 జనవరి 24వ తేదీ వరకు కార్డులు చెల్లుబాటు అవుతాయని మంత్రిత్వశాఖ వెల్లడించింది. హయ్యా కార్డు హోల్డర్లు దేశంలోకి ప్రవేశించడానికి ఇతర ఏ ఎంట్రీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అలాగే ఈ పొడిగింపు ఆటోమెటిక్‌గా వర్తింప చేయడం జరుగుతుందని, దీనికోసం అదనంగా ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది.

హయ్యా కార్డ్‌ హోల్డర్లకు ఖతార్‌లో ఎంట్రీకి కావాల్సినవి..

1. హయ్యా కార్డ్‌లను కలిగి ఉన్నవారు ధృవీకరించబడిన హోటల్ రిజర్వేషన్‌లను కలిగి ఉన్నట్లయితే కుటుంబం లేదా స్నేహితులతో ఉండగలిగేలా దేశంలోకి ప్రవేశించవచ్చు.

2. ఈ కార్డు హోల్డర్ల పాస్‌పోర్ట్ ఖతార్‌కు వచ్చిన తర్వాత నుంచి కనీసం 3 నెలల వరకు చెల్లుబాటు అయ్యేలా ఉండాలి.

3. వారు బస చేసే కాలానికి ఆరోగ్య బీమాను కలిగి ఉండడం తప్పనిసరి.

4. అలాగే తప్పనిసరిగా రౌండ్-ట్రిప్ టిక్కెట్ కూడా ఉండాలి.

హయ్యా కార్డ్ బెనిఫిట్స్..

1. ఫిఫా ప్రపంచ కప్ టోర్నమెంట్ కోసం పరిచయం చేయబడిన ‘హయ్యా విత్ మీ’ ఫీచర్ పొడిగింపు వ్యవధి 2024 వరకు వర్తిస్తుంది. ఇది కార్డు హోల్డర్ వారితో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను ఆహ్వానించడానికి అనుమతిస్తుంది.

2. ఇది మల్టీపుల్ ఎంట్రీ పర్మిట్.

3. దీనికి ఎలాంటి అదనపు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు.

4. కార్డుదారులు ఈ-గేట్స్‌ను (E-Gates) ఉపయోగించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.

Updated Date - 2023-01-31T11:53:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising