ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking: ప్రస్తుతం చేస్తున్న జాబ్‌కే మళ్లీ దరఖాస్తు.. అందులోనూ అదే కంపెనీలో సేమ్ పోస్ట్ కూడా.. ఇంతకీ ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే..

ABN, First Publish Date - 2023-03-15T12:39:34+05:30

అమెరికాకు చెందిన ఓ యువతి (US Woman) ప్రస్తుతం చేస్తున్న జాబ్ కోసమే మళ్లీ దరఖాస్తు చేసుకుంది (Reapplies For Her Own Job).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాకు చెందిన ఓ యువతి (US Woman) ప్రస్తుతం చేస్తున్న జాబ్ కోసమే మళ్లీ దరఖాస్తు చేసుకుంది (Reapplies For Her Own Job). అందులోనూ అదే కంపెనీ కూడా. ఇంకా చెప్పాలంటే సేమ్ పోస్ట్ కూడా. ఇదేంటి.. ఆమెకు ఏమైనా పిచ్చినా? ఇలా చేయడం ఏంటి? అని అనుకుంటున్నారు కదా! అక్కడికే వస్తున్నాం. ఇప్పుడు.. మనం జాబ్ చేస్తున్న కంపెనీ.. మనం ప్రజెంట్ పని చేస్తున్న పోస్ట్ కోసం.. ప్రస్తుతం ఇస్తున్న శాలరీ కంటే ఎక్కువ చెల్లిస్తామని (Higher Pay) వాంటెడ్ యాడ్ ఇస్తే మీరు ఏం చేస్తారు. ఇదిగో అమెరికన్ యువతి కింబర్లీ న్గుయెన్ (25) కూడా అచ్చం ఇదే పరిస్థితి ఎదురైంది. ఇలాంటి పరిస్థితుల్లో కామన్‌గానైతే ఉద్యోగులు వెళ్లి, కంపెనీ యాజమాన్యాన్ని నిలదీయడం చేస్తారు. అలా కొత్తవారికి మాకంటే ఎక్కువ శాలరీలు ఎలా ఇస్తారని గొడవకు దిగుతారు.

కానీ, కింబర్లీ మాత్రం మరో మాట మాట్లాడకుండా.. పేపర్‌లో ప్రకటన చూసిన వెంటనే తాను చేస్తున్న ఉద్యోగానికే మళ్లీ దరఖాస్తు చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ ద్వారా తన స్నేహితులతో పంచుకోవడంతో అది కాస్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆమె చేస్తున్న జాబ్‌కు కంపెనీ కేవలం రూ.26లక్షలు మాత్రమే చెల్లిస్తుందట. అదే కొత్తగా ఉద్యోగుల కోసం ఇచ్చిన ప్రకటనలో మాత్రం కంపెనీ ఏకంగా రూ. 73లక్షలు ఇస్తామని పేర్కొంది. అందుకే వెంటనే తాను చేస్తున్న ఉద్యోగానికే మళ్లీ దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా 'న్యూయార్క్ కొత్త జీతం పారదర్శకత చట్టాని'కి ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసింది. ఇక కింబర్లీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలి స్పందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: వందకు పైగా దేశాల టూరిస్టులకు ఒమాన్ బంపరాఫర్.. కానీ, భారతీయులకు మాత్రం కండిషన్స్ అప్లై..!

Updated Date - 2023-03-15T12:39:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising