Parliament Security Breach Case: పార్లమెంటు దాడి మాస్టర్‌మైండ్‌కు సహకరించిన ఆరవ నిందితుడి అరెస్టు
ABN, Publish Date - Dec 16 , 2023 | 05:29 PM
పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝాకు సహకరించిన ఆరవ నిందితుడు మనోజ్ కుమావత్ )ను ఢిల్లీ పోలీసులు శుక్రవారంనాడు అరెస్టు చేశారు. పార్లమెంటుపై దాడి అనంతరం ఢిల్లీ నుంచి మనోజ్ కుమావత్ ఢిల్లీ నుంచి తప్పించుకునేందుకు సహకరించారనే అభియోగంపై ఈ అరెస్టు జరిగింది.
న్యూఢిల్లీ: పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనకు (Parliament Security Breach) పాల్పడిన కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝాకు సహకరించిన ఆరవ నిందితుడు మనోజ్ కుమావత్ (Manoj Kumawat)ను ఢిల్లీ పోలీసులు శుక్రవారంనాడు అరెస్టు చేశారు. పార్లమెంటుపై దాడి అనంతరం ఢిల్లీ నుంచి మనోజ్ కుమావత్ ఢిల్లీ నుంచి తప్పించుకునేందుకు సహకరించారనే అభియోగంపై ఈ అరెస్టు జరిగింది. పార్లమెంటులో దాడి వ్యూహంలో మహేష్ ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.
మహేష్ ఆచూకీ తెలుసుకున్న పోలీసులు అతన్ని కూలంకషంగా విచారణ జరిపిన అనంతరం అరెస్టు చేశారు. పార్లమెంటుపై దాడి జరిగిన రోజే మహేష్ ఢిల్లీకి వచ్చాడని, దాడి అనంతరం లలిత్ ఝాకు రాజస్థాన్‌లో అతను బస కల్పించాడని పోలీసులు చెబుతున్నారు. భద్రతా ఉల్లంఘనల కేసులో అరెస్టయిన నలుగురు వ్యక్తులకు చెందిన మొబైల్ ఫోన్స్ ధ్వంసం చేయడంలో కూడా మహేష్ ప్రమేయం ఉందని వారంటున్నారు. మహేష్‌కు పాటియాలా కోర్టు ఏడు రోజుల పోలీస్ కస్టడీకి శుక్రవారంనాడు అదేశించింది.
Updated Date - Dec 16 , 2023 | 05:32 PM