Home » Security Breach
77వ రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఉదయం జరిగే పరేడ్‌ను సురక్షితంగా నిర్వహించేందుకు పోలీసు, పారామిలిటరీ దళాలు, సైన్యం సంయుక్తంగా భద్రతా ఏర్పాట్లు చేశాయి.
కశ్మీరీ సంప్రదాయ దుస్తులు ధరించిన వ్యక్తి గేట్ డీ1 ద్వారా రామాలయంలోకి ప్రవేశించాడు. అతనిని కశ్మీర్‌లోని షోపియాన్ నివాసి అహ్మద్ షేక్‌గా గుర్తించారు.
ముజఫరాపూర్‌లోని కాంతి స్కూలులో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని తేజస్వి యాదవ్ ఆవిష్కరించారు. పబ్లిక్ మీటింగ్ అనంతరం హెలికాప్టర్‌లో బయలుదేరేందుకు సిద్ధమయ్యారు.
పంద్రాగష్టు వేడుకలకు దేశవ్యాప్తంగా భద్రతను గణనీయంగా పెంచారు. పెట్రోలింగ్‌ను తీవ్రతరం చేయడం, వాహనాలు, వ్యక్తుల కదలికల్ని చెక్‌పోస్టులు, మెరుగైన ఏఐ నిఘాతో డేగకన్ను వేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వ్యూహాత్మక ప్రదేశాలలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
నిందితులపై తగినన్ని సాక్ష్యాధారాలు ఉన్నందున బెయిల్ ఇవ్వరాదని ఢిల్లీ పోలీసులు విచారణ సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. విశ్వసనీయ పత్రాలు, మెటీరియల్ ఉన్నందున 1967 చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద శిక్షార్హులని కోర్టుకు విన్నవించారు.
ఢిల్లీలోని పార్లమెంటు భద్రత బాధ్యతలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎ్‌సఎఫ్) చేపట్టనుంది. మొత్తం 3,317 మంది సీఐఎ్‌సఎఫ్ సిబ్బంది సోమవారం నుంచి పార్లమెంటు ఆవరణలో ఉగ్రవాద వ్యతిరేక...,..
దేశంలో కొత్త, పాత పార్లమెంట్ భవనాల(Parliament Buildings) సెక్యూరిటీ బాధ్యతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)కు అప్పగించారు. ఈ క్రమంలో మే 20వ తేదీ నుంచి 3 వేల 300 మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని పార్లమెంట్ భద్రతకు వినియోగించనున్నారు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర అసోం పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఎదరవుతున్న భద్రతా లోపాలపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన చొరవ తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ఖర్గే కోరారు.
ఈనెల 13న ఇద్దరు వ్యక్తులు పార్లమెంటు భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన ఘటనతో చిక్కుల్లో పడిన మైసూలు లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఆదివారంనాడు తొలిసారి స్పందించారు. తాను దేశ భక్తుడనో, ద్రోహినో భగవంతుడికి మాత్రమే తెలుసునని అన్నారు. సింహా కార్యాలయం నుంచే ఇద్దరు నిందితులిద్దరూ పాస్‌లు పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి.
దేశంలోని యువత ఉద్యోగాలు లేక, నిరుద్యోగిత కారణంగా ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లలో ఎక్కువ సమయం తలమునకలవుతున్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. పార్లమెంటు భద్రతా వైఫల్యం మరో ప్రశ్నను కూడా లేవనెత్తిందని, ఈ తరహా నిరసనలకు కారణమేమిటనేదే ఆ ప్రశ్న అని, దేశంలోని నిరుద్యోగితే ఈ ప్రశ్నకు సమాధానమని ఆయన చెప్పారు.