Share News

Independence Day : ఢిల్లీ, ఇతర కీలక నగరాల్లో AI నిఘా, ఎర్రకోట వేడుకలకు 20,000 మంది భద్రతా సిబ్బంది

ABN , Publish Date - Aug 15 , 2025 | 06:40 AM

పంద్రాగష్టు వేడుకలకు దేశవ్యాప్తంగా భద్రతను గణనీయంగా పెంచారు. పెట్రోలింగ్‌ను తీవ్రతరం చేయడం, వాహనాలు, వ్యక్తుల కదలికల్ని చెక్‌పోస్టులు, మెరుగైన ఏఐ నిఘాతో డేగకన్ను వేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వ్యూహాత్మక ప్రదేశాలలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Independence Day :  ఢిల్లీ, ఇతర కీలక నగరాల్లో  AI నిఘా,  ఎర్రకోట వేడుకలకు 20,000 మంది భద్రతా సిబ్బంది
Red Fort celebrations security

న్యూఢిల్లీ, ఆగస్టు 15 : పంద్రాగష్టు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశవ్యాప్తంగా భద్రత గణనీయంగా పెంచారు. పెట్రోలింగ్‌ను తీవ్రతరం చేయడం, వాహనాలు, వ్యక్తుల కదలికల్ని చెక్‌పోస్టులు, మెరుగైన ఏఐ నిఘాతో డేగకన్ను వేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో, సరిహద్దు పాయింట్లు, వ్యూహాత్మక ప్రదేశాలలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ దళాలు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG), మిలిటరీ ఇంటెలిజెన్స్, ఇతర ఏజెన్సీలతో కూడిన బహుళ-స్థాయి ప్రణాళికతో దేశ రాజధాని భద్రతను బలోపేతం చేశారు.

a.jpg


స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగనున్న ఢిల్లీ ఎర్రకోట ప్రాంతంలో 20,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ఢిల్లీ పోలీసు అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం, ఫొటో ఐడెంటిటీ, చొరబాటు నిరోధక కెమెరాలు, పీపుల్ కౌంట్ కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) వదిలివేసిన వస్తువులను గుర్తించడం వంటివాటికోసం అధునాతన కృత్రిమ మేధస్సు(AI) వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనుమానాస్పద వాహనాలను ఫ్లాగ్ చేయడానికి ANPR నంబర్ ప్లేట్‌లను స్కాన్ చేస్తుంది. ఇక ఫొటో ఐడెంటిటీ వ్యవస్థ 3,00,000 మంది అనుమానితుల డేటాబేస్‌ను అనుసంధానిస్తుంది.

a-1.jpg


ఎర్రకోటలో లేదా చుట్టుపక్కల ఏదైనా గమనించని వస్తువును కనుగొన్న తర్వాత అబాండన్డ్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ సిస్టమ్ కంట్రోల్ రూమ్‌కు తక్షణ అలారం అలర్ట్ అందిస్తుంది. యాంటీ-ఇంట్రూషన్ కెమెరాలు ఎర్రకోట ప్రతి గోడ, రెయిలింగ్‌ను కవర్ చేస్తాయి ఏదైనా అనుమానాస్పద కదలిక లేదా ఉల్లంఘన ప్రయత్నం గురించి అధికారులను అప్రమత్తం చేస్తాయి. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. పైకప్పులపై స్నిపర్‌లను ఉంచారు. 800 కి పైగా CCTV కెమెరాలు కీలక ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నాయి. ఎర్రకోట లోపల, వెలుపల రెండు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు 426 కెమెరాల నుండి ఫీడ్‌బ్యాక్‌లను రియల్ టైంలో ట్రాక్ చేస్తాయని అధికారులు తెలిపారు. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా దేశంలోని కీలకనగరాల్లోనూ ఏఐ నిఘా పెట్టారు.

Indipendence-day-security.jpg

Updated Date - Aug 15 , 2025 | 06:41 AM