ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

New Parliament Building : కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై పిల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

ABN, First Publish Date - 2023-05-26T14:27:57+05:30

నూతన పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) చేత ప్రారంభింపజేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం

Supreme Court
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : నూతన పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) చేత ప్రారంభింపజేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)ను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను ఎందుకు దాఖలు చేశారో తమకు తెలుసునని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం తెలిపింది. దీనిని రాజ్యాంగంలోని అధికరణ 32 ప్రకారం విచారణ జరిపేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్‌ను అడ్వకేట్ జయ సుకిన్ దాఖలు చేశారు.

కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మే 28న ప్రారంభించబోతున్నారు. దీనిని రాష్ట్రపతి చేత ప్రారంభింపజేయాలని కాంగ్రెస్ సహా దాదాపు 20 ప్రతిపక్ష పార్టీలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అడ్వకేట్ సుకిన్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

భారత రాజ్యాంగంలోని అధికరణ 79 ప్రకారం దేశానికి కార్యనిర్వాహక అధిపతి రాష్ట్రపతి అని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించి ఉండవలసిందన్నారు. రాష్ట్రపతికి కొన్ని అధికారాలు ఉంటాయని, రకరకాల కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటారని చెప్పారు. ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడం సరికాదని, ఆదివారం జరిగే పార్లమెంటు భవన ప్రారంభోత్సవం చట్ట ప్రకారం జరగడం లేదని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపేందుకు న్యాయస్థానం అంగీకరించకపోతే, తాను ఉపసంహరించుకుంటానని తెలిపారు. పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతిని దూరంగా ఉంచడం వెనుక మాల్‌ప్రాక్టీస్ ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించకుండా రాష్ట్రపతిని లోక్‌సభ సచివాలయం, కేంద్ర ప్రభుత్వం అవమానించాయన్నారు.

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ, ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతిస్తే, దానిని తిరిగి హైకోర్టులో దాఖలు చేస్తారన్నారు. దీంతో ధర్మాసనం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

ఇదిలావుండగా, నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి టీడీపీ, వైకాపా, బీజేడీ, ఎస్ఏడీ తదితర పార్టీలు హాజరుకాబోతున్నాయి. కాంగ్రెస్, డీఎంకే తదితర పార్టీలు బహిష్కరిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

Kishan Reddy: బీఆర్ఎస్ రాకపోతే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆగిపోతోందా?

DGP: కొత్త డీజీపీ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

Updated Date - 2023-05-26T14:27:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising