Kishan Reddy: బీఆర్ఎస్ రాకపోతే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆగిపోతోందా?

ABN , First Publish Date - 2023-05-26T14:04:27+05:30 IST

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

Kishan Reddy: బీఆర్ఎస్ రాకపోతే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆగిపోతోందా?

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ (CM KCR)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఫైర్ (Fire) అయ్యారు. సచివాలయం (Secretariat) ప్రారంభోత్సవానికి గవర్నర్‌ (Governor)ను ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ (BRS) రాకపోతే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆగిపోతోందా? అని ప్రశ్నించారు. ట్విన్ టవర్స్ (Twin Towers) శిలాఫలకంపై స్థానిక ఎంపీనైన తన పేరు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌తో నీతులు చెప్పించుకునే పరిస్థితుల్లో బీజేపీ (BJP) లేదన్నారు.

పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం (New Parliament Building Inauguration)పై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం నిర్వహించే సమావేశాలకు సీఎం కేసీఆర్ హాజరుకాకపోవటం బాధ్యతారాహిత్యమన్నారు. రేపటి నీతీ ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉండటం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. సీఎం కేసీఆర్ వైఖరి కారణంగా పోరాడి సాధించుకున్న తెలంగాణ నష్టపోతోందన్నారు. ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రాకపోవడం సిగ్గుచేటన్నారు. మహారాష్ట్రకు వెళ్ళటానికి తీరిక ఉంది కానీ.. అంబేద్కర్‌, జగ్జీవన్ రామ్ జయంతికి పూలమాల వేయటానికి కేసీఆర్‌కు తీరికలేదా అని ప్రశ్నించారు. కేంద్రంతో ఘర్షణాత్మకమైన వైఖరితో రాష్ట్రం నష్టపోతోందన్నారు. అవకాశం ఉన్న చోట తెలంగాణ వాయిస్ వినిపించటంలో కేసీఆర్ విఫలం అయ్యారని, ప్రభుత్వాల మధ్యలో ఘర్షణాత్మకమైన వైఖరి వల్ల తెలంగాణకు నష్టమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-05-26T14:04:27+05:30 IST